క్రీడాభూమి

బిసిసిఐకి లీగల్ నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, మే 3: ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయడం లేదంటూ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) నోటీసు పంపింది. ముందు నుంచి హెచ్చరిస్తూ వచ్చిన పిసిబి గత్యంతరం లేని పరిస్థితుల్లో చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడాల్సి ఉన్నప్పటికీ, ప్రతిసారీ చివరి క్షణం వరకూ నాన్చివేత ధోరణిని అనుసరించిన బిసిసిఐ వివాదాన్ని రాజేసింది. పాక్‌తో క్రికెట్ సంబంధాల పునరుద్ధరణకు ఇది సరైన సమయం కాదని బిసిసిఐకి తెలుసు. కానీ, పలు సందర్భాల్లో పిసిబి అధికారులను కలిసి, చర్చలు జరపడం బిసిసిఐకి ఆనవాయితీగా మారింది. సిరీస్ వివరాలను ఖరారు చేసుకోవడానికి భారత్‌కు గతంలో పిసిబి చైర్మన్ షహర్యార్ ఖాన్‌ను ప్రస్తుతం ఐసిసి చైర్మన్‌గా ఉన్న అప్పటి బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఆహ్వానించాడు. తీరా షహర్యార్ వచ్చేసరికి ఏం చేయాలో అర్థంగాక, అంతకు ముందు శివసేన కార్యకర్తలు బిసిసిఐ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చిన సంఘటనను సాకుగా చూపి అతనితో భేటీ కాలేదు. ఢిల్లీలో మాట్లాడుకుందామని సూచించి, అక్కడికి కూడా వెళ్లలేదు. ఫ్యూచర్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్స్‌ను అనుసరించి పాక్‌తో సిరీస్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో ఆడాల్సి ఉన్నప్పటికీ అక్కడికి వచ్చేది లేదని తేల్చిచెప్పిన బిసిసిఐ ఆతర్వాత శ్రీలంకను తటస్థ వేదికగా పేర్కొంది. అందుకు తమ దేశ ప్రభుత్వ అనుమతిని కూడా పిసిబి పొందిన తర్వాత, తమకు ఇంకా కేంద్రం నుంచి సమాచారం రాలేదంటూ చివరి వరకూ సమస్యను నాన్చింది. ఇక సిరీస్ జరిగే అవకాశం లేదని పిసిబితోనే చెప్పించింది. కాగా, ముందుగా కేంద్రం అభిప్రాయం తెలుసుకోకుండా, అనుమతి తీసుకోకుండా పిసిబితో చర్చలు జరిపి, వేదికను, తేదీలను ఖరారు చేయడం బిసిసిఐ అహంకార పూరిత ధోరణికి నిదర్శమన్న విమర్శలున్నాయి. అందుకే, ముంబయిపై ఉగ్రవాద దాడుల తర్వాత పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకపోయినా భారత్‌ను ఎన్నడూ విమర్శించని వారు ఇప్పుడు బిసిసిఐ వైఖరిపై ధ్వజమెత్తుతున్నారు. ధన బలంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నదని విమర్శిస్తున్నారు. బిసిసిఐ వైఖరితో చాలా దేశాల క్రికెట్ బోర్డులు ఇప్పటికే విసిగిపోయాయి. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి పిసిబి ప్రయత్నిస్తున్నది. నోటీసు పంపడం ద్వారా భారత్‌ను ఇరుకున పెట్టే వ్యూహ రచన చేస్తున్నది. ఒకవేళ బిసిసిఐ దిగివస్తే, సిరీస్‌లు ఆడలేకపోయినా, నష్టపరిహారమైనా దక్కుతుందని పిసిబి ఆశ. అంతేగాక, భారత్‌నే కోర్టుకు లాగే ప్రయత్నం చేస్తుండడంతో, మిగతా క్రికెట్ బోర్డులు భయపడి, పాక్‌లో సిరీస్‌లు ఆడేందుకు సిద్ధమయ్యే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయం కూడా పిసిబిలో కనిపిస్తున్నది. మొత్తం మీద, గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను ఖచ్చితంగా అమలు చేసి, ద్వైపాక్షిక సిరీస్‌లకు సిద్ధం కావాలని పిసిబి కోరుతున్నది. లేకపోతే, నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తున్నది. ఈ నోటీసుకు బిసిసిఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.