క్రీడాభూమి

అవసరమైతే కోర్టుకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 3: అవసరమని అనుకుంటే, సుప్రీం కోర్టుకు వెళతామని సభ్య సంఘాలకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) పాలనా వ్యవహారాల కమిటీ (సిఒఎ) స్పష్టం చేసింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)లో వాటాను తగ్గించుకోవడానికి బిసిసిఐ ఏమాత్రం ఇష్టపడడం లేదు. ఈ విషయంలో ఐసిసితోనే అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తన చేష్టల ద్వారా స్పష్టం చేస్తున్నది. ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీకి మిగతా ఏడు దేశాలు తమతమ జట్లను ప్రకటించినప్పటికీ, భారత్ మాత్రం ఇంకా వివరాలను అందించకుండా తాత్సారం చేస్తున్నది. ‘బిగ్ త్రీ’ దేశాల భారీ వాటాను తగ్గించాలన్న తీర్మానాన్ని వాపసు తీసుకోకపోతే, చాంపియన్స్ ట్రోఫీని బహిష్కరిస్తామన్న సంకేతాలు పంపింది. ఈ పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సిఒఎ స్పందించింది. ఒకవేళ భారత క్రికెట్ ప్రయోజనాలకు భిన్నంగా బిసిసిఐ నిర్ణయాలు తీసుకుంటున్నదన్న అనుమానం వస్తే, సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని కమిటీ చీఫ్ వినోద్ రాయ్ స్పష్టం చేశాడు. ఈనెల 7న జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఐసిసి తీరుకు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ఆమోదించాలని బిసిసిఐ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. భారత క్రికెట్ ప్రక్షాళనకు సుప్రీం కోర్టు నియమించిన లోధా కమిటీ చాలకాలం క్రితమే సమర్పించిన నివేదికను అమలు చేయాల్సిన బాధ్యత బిసిసిఐపై ఉంది. అయితే, వీటిని తు.చ తప్పకుండా అమలుచేస్తే, భారత క్రికెట్‌పై తమ పట్టు తగ్గుతుందని బిసిసిఐ అధికారుల భయం. అందుకే, ఇంతకాలం సిఫార్సులు అమలుకాకుండా అడ్డుకుంటూ వచ్చారు. సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ బిసిసిఐలోని చాలా వరకు సభ్య సంఘాలు లోధా సిఫార్సులను అమలు చేస్తామని రాతపూర్వక హామీ ఇవ్వలేదు. తదనుగుణంగా తీర్మానాలను ఆమోదించలేదు. ఒక రకంగా చెప్పాలంటే, సభ్య సంఘాలన్నీ ఇంకా బిసిసిఐ చెప్పుచేతల్లోనే ఉన్నాయి. కాబట్టి, ఐసిసిలో వాటాల ప్రతిపాదనను వ్యతిరేకించడం, అవసరమైతే చాంపియన్స్ ట్రోఫీని బహిష్కరించడం వంటి కీలక అంశాలపై సభ్య సంఘాలు బిసిసిఐకి సానూకూలంగా ఓటువేసి, తీర్మానాలను ఆమోదించే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని గమనించిన సిఎఒ చీఫ్ వినోద్ రాయ్ స్పష్టమైన ప్రకటన జారీ చేశాడు. భారత క్రికెట్ రంగాన్ని దెబ్బతీసే రీతిలో బిసిసిఐ ఎలాంటి చర్య తీసుకున్నా అడ్డుకొని తీరుతామని తేల్చిచెప్పాడు. అవసరమైతే కోర్టును సంప్రదిస్తామని హెచ్చరించాడు.
తెగేదాకా లాగకండి..
ఏ విషయాన్నయినా తెగే వరకూ లాగడం సరికాదని బిసిసిఐకి వినోద్ రాయ్ హితవు పలికాడు. మొండి వైఖరిను అనురిస్తూ, గుడ్డిగా ముందుకు వెళితే, ఆతర్వాత ఐసిసితో చర్చలకు అవకాశం ఉండదని అన్నాడు. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పాడు. భారత్‌కు రావాల్సిన మొత్తాలను వదులుకోవడానికి సిద్ధంగా లేమని, అయితే, ఈ విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అనుసరించాల్సి ఉంటుందని అన్నాడు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే తాము పని చేస్తున్నామని, కాబట్టి, బిసిసిఐ తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ కోర్టు దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అనుసరిస్తున్న వైఖరిని కూడా కోర్టుకు తెలియచేయడం తమ పనిలో భాగమని అన్నాడు. అన్ని కోణాల్లోనూ ఆలోచించిన తర్వాతే తగిన నిర్ణయాలు తీసుకోవాలని బిసిసిఐ అధికారులకు వినోద్ రాయ్ సూచించాడు. తొందరపాటు తగదని హితవు పలికాడు. దూకుడుగా వ్యవహరిస్తే, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే అవకాశాలను కోల్పోతామని హెచ్చరించాడు.