క్రీడాభూమి

ఎస్‌బిఎల్ యథాతథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పష్టం చేసిన నిర్వాహకులు
న్యూఢిల్లీ, మే 8: ఎవరు అనుమతించినా, అనుమతించకపోయినా సూపర్ బాక్సింగ్ లీగ్ (ఎస్‌బిఎల్) జరిగి తీరుతుందని ఆ టోర్నీ నిర్వాహకులు స్పష్టం చేసింది. దేశంలో ప్రొఫెషనల్ బాక్సింగ్‌ను ప్రోత్సహిస్తున్న భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎఫ్‌ఐ) సొంతంగా వివిధ స్థాయిలో టోర్నీలను నిర్వహించాలన్న ఆలోచనతో ఉంది. అందుకే, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న ఎస్‌బిఎల్‌కు గుర్తింపునివ్వలేదు. కానీ, బిఎఫ్‌ఐ అనుమతి లేకపోయినా, ఎస్‌బిఎల్ ముందుగా ప్రకటించినట్టు జూలై 7 నుంచి ఆగస్టు 12 మధ్య జరుగుతుందని టోర్నీ ప్రమోటర్, యజమాని బిల్ డొసాంజ్ స్పష్టం చేశాడు. అనుమతి కోసం తాము ఎదురుచూడడం లేదని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఇంగ్లాండ్‌కు చెందిన ఈ వ్యాపారవేత్త వ్యాఖ్యానించాడు.
బ్రెజిల్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ టోర్నీ
ఫైనల్‌లో అమల్‌రాజ్ ఓటమి
న్యూఢిల్లీ, మే 8: బ్రెజిల్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్‌లో ఓడిన భారత ఆటగాడు ఆంథోనీ అమల్‌రాజ్ రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందాడు. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం ఫైనల్‌లో బ్రెజిల్ ఆటగాడు కాల్‌డ్రానో హుగోను ఢీకొన్న అతను 12-14, 9-11, 7-11, 7-11, 5-11 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. ఇటీవల జరిగిన చిలీ ఓపెన్‌లోనూ అతను రన్నరప్‌గా నిలిచాడు. అప్పటి ఫైనల్‌లో అతను తన సహచరుడు సౌమ్యజిత్ ఘోష్ చేతిలో ఓడాడు.
ప్రో కబడ్డీకి
కొత్త స్పాన్సరర్
న్యూఢిల్లీ, మే 8: ప్రో కబడ్డీకి కొత్త స్పాన్సరర్‌గా ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ కంపెనీ ‘వివో’ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది జూలైలో ప్రో కబడ్డీ ఐదో సీజన్ మొదలవుతుంది. అప్పటి నుంచి ఐదేళ్ల కాలానికి ‘వివో’ సంస్థ ఈ టోర్నమెంట్‌కు స్పాన్సరర్‌గా వ్యవహరిస్తుంది. ఈసారి టోర్నమెంట్‌లో మొత్తం 12 జట్లు పాల్గొంటాయి. 13 వారాలపాటు జరిగే పోటీల్లో 130కి పైగా మ్యాచ్‌లు ఉంటాయి.