క్రీడాభూమి

చరిత్ర సృష్టించిన ఝులన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్చ్ఫెస్ట్రూమ్ (దక్షిణాఫ్రికా), మే 9: అంతర్జాతీయ వనే్డ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన మహిళా బౌలర్‌గా భారత మహిళా క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి (34) చరిత్ర సృష్టించింది. మంగళవారం ఇక్కడ జరిగిన వనే్డ మ్యాచ్‌లో 20 పరుగులకే 3 రాబట్టుకున్న ఝులన్ గోస్వామి చివర్లో ఆతిథ్య దక్షిణాఫ్రికా క్రీడాకారిణి రైసిబె నొజఖేని పెవిలియన్‌కు చేర్చి 181వ వికెట్‌ను కైవసం చేసుకోవడం ద్వారా ఈ ఘతన సాధించింది. దీంతో మహిళల వనే్డ క్రికెట్‌లో గత దశాబ్ద కాలం నుంచి ఆస్ట్రేలియా క్రీడాకారిణి కాథరిన్ ఫిట్జ్‌ప్యాట్రిక్ పేరు మీద ఉన్న అత్యధిక వికెట్ల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. గతంలో ఫిట్జ్‌ప్యాట్రిక్ మొత్తం 109 మ్యాచ్‌లలో 180 వికెట్లు కైవసం చేసుకుని అంతర్జాతీయ వనే్డల్లో అత్యధిక వికెట్లు సాధించిన మహిళా బౌలర్‌గా రికార్డు సృష్టించగా, ఝులన్ గోస్వామి ఇప్పుడు 153వ మ్యాచ్‌లో 181వ వికెట్‌ను రాబట్టుకుని ఫిట్జ్‌ప్యాట్రిక్ రికార్డును అధిగమించింది.
పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో చక్‌దహ అనే కుగ్రామానికి చెందిన ఝులన్ గోస్వామి 2002లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించింది. 2007లో ఉత్తమ మహిళా క్రికెటర్‌గా ఐసిసి నుంచి అవార్డు పొందిన ఝులన్ గోస్వామితో పాటు కెప్టెన్ మిథాలీ రాజ్ గత 15 ఏళ్ల నుంచి భారత మహిళా క్రికెట్ జట్టుకు పర్యాయ పదాలుగా కొనసాగుతున్న విషయం విదితమే. కెరీర్ తొలి నాళ్లలో అత్యంత వేగవంతమైన భారత మహిళా ఫాస్ట్ బౌలర్‌గా ఖ్యాతి పొందిన ఝులన్ గోస్వామి ఇప్పుడు మూడు పదుల వయసు దాటినప్పటికీ అటు బౌలింగ్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌లో చక్కగా

రాణిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటివరకూ 10 టెస్టు మ్యాచ్‌లు ఆడి 40 వికెట్లు సాధించిన ఝులన్ గోస్వామి 60 అంతర్జాతీయ ట్వంటీ-20 మ్యాచ్‌లలో 50 వికెట్లు కైవసం చేసుకుంది.

చిత్రం..ఝులన్ గోస్వామి