క్రీడాభూమి

మాడ్రిడ్ ఓపెన్ నుంచి షరపోవా ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, మే 9: మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ రెండో రౌండ్‌లో కెనడా క్రీడాకారిణి యుగెనీ బౌచర్డ్ రష్యా అందాల భామ మరియా షరపోవాకు చెక్ పెట్టింది. ఈ మ్యాచ్ ఆరంభంలో బౌచర్డ్ కాస్త వెనుకబడినప్పటికీ ఆ తర్వాత అద్భుతమైన పోరాట పటిమను కనబర్చి షరపోవాను మట్టికరిపించింది. డోపింగ్ వ్యవహారంలో 15 నెలల పాటు నిషేధానికి గురైన షరపోవాను వైల్డ్‌కార్డుల ద్వారా మళ్లీ పెద్ద ఈవెంట్లలో ఆడేందుకు అనుమతించడాన్ని తప్పుపడుతున్న బౌచర్డ్ గత వారం షరపోవాను ‘మోసకారి’గా అభివర్ణించిన విషయం విదితమే. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 60వ స్థానంలో కొనసాగుతున్న బౌచర్డ్ దాదాపు 3 గంటల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ తొలి సెట్‌లో 2-4 తేడాతో వెనుకబడినప్పటికీ మొక్కవోని ధైర్యంతో పోరాడి 7-5 తేడాతో ఆ సెట్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత దీటుగా జవాబిచ్చిన షరపోవా 6-2 తేడాతో రెండో సెట్‌ను గెలుచుకోగా, మూడో సెట్‌లో మరింత విజృంభించిన బౌచర్డ్ 6-4 తేడాతో విజయం సాధించి షరపోవాకు చెక్ పెట్టింది. మూడో రౌండ్‌లో బౌచర్డ్ జర్మనీకి చెందిన టాప్‌సీడ్ క్రీడాకారిణి ఏంజెలిక్ కెర్బర్‌తో తలపడనుంది. సోమవారం జరిగిన రెండో రౌండ్‌లో కెర్బర్ 6-2, 1-6, 7-5 తేడాతో కటెరినా సైనియకోవాపై విజయం సాధించింది.
మోన్‌ఫిల్స్ నిష్క్రమణ
కాగా, పురుషుల సింగిల్స్ విభాగంలో ఫ్రాన్స్‌కు చెందిన 15వ సీడ్ ఆటగాడు గేల్ మోన్‌ఫిల్స్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఫ్రాన్స్‌కే చెందిన గిలెస్ సైమన్ 0-6, 6-0, 7-6 తేడాతో మోన్‌ఫిల్స్‌ను ఓడించగా, థామస్ బెర్డిచ్, గ్రిగర్ దిమిత్రోవ్, నిక్ కిర్గియోస్ కూడా తమతమ ప్రత్యర్థులపై విజయం సాధించి తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లారు.

చిత్రం..రష్యా ముద్దుగుమ్మకు చెక్ పెట్టిన బౌచర్డ్