క్రీడాభూమి

వరల్డ్ సిరీస్‌కు వికాస్ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: ఆసియా చాంపియన్‌షిప్స్ పోటీల సెమీఫైనల్ మ్యాచ్‌కి గైర్హాజరైన ప్రముఖ బాక్సర్ వికాస్ స్వరూప్‌ను వరల్డ్ సిరీస్ ఆఫ్ బాక్సింగ్‌లో పోటీ చేయడానికి అనుమతించేది లేదని, అంతేకాకుండా అతను జాతీయ బాక్సింగ్ఫెడరేషన్ ఏర్పాటు చేసిన క్రమశిక్షణా కమిటీ ముందు హాజరయి తన గైరుహాజరుకు కారణాలను వివరించాల్సి ఉంటుందని ఫెడరేషన్ అధ్యక్షుడు అజయ్ సింగ్ మంగళవారం చెప్పాడు. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతక విజేత, అలాగే ఆసియన్ క్రీడల్లో స్వర్ణ పతక విజేత అయిన వికాస్ గత వారం ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్‌లో జరిగిన ఆసియన్ చాంపియన్‌షిప్స్ మిడిల్ వెయిట్ విభాగం సెమీఫైనల్‌లో పాల్గొనక పోవడంతో ప్రత్యర్థి కొరియాకు చెందిన లీకు వాకోవర్ లభించింది. ఆ పోటీలో పాల్గొనకూడదన్న వికాస్ నిర్ణయానికి కారణాలేమిటో ఆ పోటీ జరిగిన సమయంలో తెలియరాలేదు. అయితే దీనిపై దర్యాప్తు జరుగుతుందని అజయ్ సింగ్ చెప్పాడు. ‘వరల్డ్ సిరీస్ ఆఫ్ బాక్సింగ్‌లో వికాస్ కచ్చితంగా పాల్గొనడు. అంతేకాదు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బిఎఫ్‌ఐ)కి చెందిన క్రమశిక్షణా కమిటీ అతనినుంచి దీనిపై వివరణ కోరుతుంది. తాను గాయపడినట్లు అతను చెప్తున్నాడు కానీ అది నిజమో కాదో తెలుసుకోవలసి ఉంది’ అని సింగ్ పిటిఐతో అన్నాడు. వికాస్ ఈ నెల 11న బ్రిటీష్ లయన్‌హార్ట్స్ తరఫున వరల్డ్ సిరీస్ ఆఫ్ బాక్సింగ్‌లో పాల్గొనాల్సి ఉంది.