క్రీడాభూమి

2024 ఒలింపిక్స్ ఎవరికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిల్స్, మే 10: మొదట ఐదు దేశాలు బరిలో ఉన్నప్పటికీ, చివరికి రెండు మాత్రమే మిగలడంతో, 2024 ఒలింపిక్స్ బిడ్స్ వ్యవహారం ఆసక్తి రేపుతున్నది. బుడాపెస్ట్ (హంగరీ), రోమ్ (ఇటలీ), హాంబర్గ్ (జర్మనీ) రేసు నుంచి వైదొలగడంతో, పోటీలో లాస్ ఏంజిల్స్ (అమెరికా), పారిస్ (ఫ్రాన్స్) మిగిలాయి. ఇటీవల కాలంలో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించడానికి వివిధ దేశాలు భయపడుతుండగా, మూడు దేశాలు వెనకడుగు వేయడం అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి)ని ఆందోళనకు గురి చేస్తున్నది. భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందోనన్న భయంతో, 2024 బిడ్‌ను పొందడంలో విఫలమైన రెండో నగరానికి 2028 ఒలింపిక్స్‌ను ఇప్పుడే కేటాయిస్తామని ప్రకటించింది. అయితే, ఈ ప్రతిపాదనకు అమెరికా సానుకూలంగా స్పందించలేదు. ఈసారి బిడ్‌ను కోల్పోతే, 2028 రేసులో ఉండబోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ముగ్గురు సభ్యులతో కూడిన ఐఒసి బృందం లాస్ ఏంజిల్స్ చేరుకోవడం ఆసక్తిని రేపుతున్నది. ఒలింపిక్స్ నిర్వాహణకు తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న పనులు, భద్రత తదితర అంశాలను ఈ బృందం పరిశీలిస్తుంది. అదే విధంగా పారిస్‌లోనూ పర్యటించిన తర్వాత నివేదికను అందచేస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 13న లీమాలో జరిగే ఐఒసి సర్వసభ్య సమావేశంలో ఓటింగ్ జరుగుతుంది. లాస్ ఏంజిల్స్, పారిస్ మధ్య జరుగుతున్న రేసులో విజేతలెవరో తేలాలంటే, సెప్టెంబర్ వరకూ వేచి చూడక తప్పదు.