క్రీడాభూమి

క్రీడా విధానంలో క్రికెట్ ఓ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: క్రికెట్‌కు ఎలాంటి ప్రత్యేకత ఉండబోదని, అది కూడా క్రీడా విధానంలో ఒక భాగంగానే ఉంటుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ స్పష్టం చేశారు. త్వరలోనే పార్లమెంటు ముందుకు రాబోయే క్రీడా బిల్లులో క్రికెట్ కూడా చేరుతుందని అన్నారు. సుప్రీం కోర్టు ఆమోదించిన లోధా కమిటీ సిఫార్సులను అన్ని క్రీడలకూ వర్తింప చేస్తామని అన్నారు. క్రీడా రంగాన్ని పారదర్శకంగా ఉంచేందుకు ఈ సిఫార్సులు ఉపయోగపడతాయన్నారు. క్రీడా బిల్లు పరిధిలోకే బిసిసిఐ కూడా వస్తుందని తెలిపారు.