క్రీడాభూమి

ఫిట్నెస్‌తోనే టైటిల్ సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11: రాబోయే చాంపియన్స్ ట్రోఫీలో ఆటగాళ్ల ఫిట్నెస్ కీలక పాత్ర పోషిస్తుందని, గాయాల సమస్య తలెత్తకపోతే, డిఫెండింగ్ చాంపియన్ టీమిండియాకు టైటిల్ నిలబెట్టుకోవడం కష్టం కాదని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. ఈ టోర్నమెంట్‌లో భారత్ జట్టు పూర్తిగా కెప్టెన్ విరాట్ కోహ్లీపైనే ఆధారపడిందన్న వాదనను కపిల్ తోసిపుచ్చాడు. ఇక్కడి మేడం తుసాడ్స్ గ్యాలరీలో తన మైనపు బొమ్మను తానే ఆవిష్కరించిన కపిల్ విలేఖరులతో మాట్లాడుతూ ధర్మశాల టెస్టును గుర్తు చేశాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ విఫలమైతే భారత జట్టు ఓడిపోతుందని అంతా అన్నారని, కానీ, ఫలితం అందుకు విరుద్ధంగా వచ్చిందని 1983లో భారత్‌కు ప్రపంచ కప్‌ను అందించిన కెప్టెన్ కపిల్ అన్నాడు. జూన్ ఒకటి నుంచి ఇంగ్లాండ్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు విజయావకాశాలు ఉన్నాయన్నాడు. జట్టు ఏ ఒక్కరిపైనో ఆధారపడలేదని స్పష్టం చేశాడు. గాయాల సమస్య తలెత్తకుంటే, కోహ్లీ బృందానికే టైటిల్ లభిస్తుందని జోస్యం చెప్పాడు. సుమారు ఐదేళ్లుగా భారత్ అద్భుతంగా రాణిస్తున్నదని, జట్టులోని ప్రతి ఒక్కరికీ తన బాధ్యత ఏమిటో తెలుసునని అన్నాడు. భారత బౌలర్లలో ఇంగ్లాండ్ పిచ్‌లపై ఎవరు రాణిస్తారన్న ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పేందుకు నిరాకరించాడు. ఏ ఒక్కరి పేరునో తాను పేర్కోలేనని, జట్టులో చాలా మంది సమర్థులు ఉన్నారని పేర్కొన్నాడు. మరో ప్రశ్నపై స్పందిస్తూ, సెలక్షన్ కమిటీ నిర్ణయాలను విమర్శించడం తగదని అన్నాడు. ఎక్కువ మంది యువ ఆటగాళ్లను ఎంపిక చేస్తే, సీనియర్లను ఎందుకు విస్మరించారన్న ప్రశ్న తెరపైకి వస్తుందన్నాడు. జట్టు ఎంపికపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని చెప్పాడు. ‘కపిల్ వంటి సమర్థుడైన ఆల్‌రౌండర్ ఇంత వరకూ రాలేదు. భవిష్యత్తులో ఎవరైనా ఆ స్థాయిని అందుకుంటారా’ అన్న ప్రశ్నపై ‘హర్యానా హరికేన్’ స్పందిస్తూ, తాను ఒక్కడికే గొప్ప ఆల్‌రౌండర్‌నని అనుకోవడం లేదన్నాడు. నిజానికి భారత దేశం వంద మంది కపిల్ దేవ్‌లను క్రికెట్ ప్రపంచానికి అందించిందని అన్నాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల కొరత ఉందని ఒక విలేఖరి వ్యాఖ్యానించగా, స్పిన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజా ఆల్ రౌండర్లుగా రాణిస్తున్న విషయాన్ని మరచిపోకూడదని కపిల్ అన్నాడు.

చిత్రం..తన మైనపు బొమ్మతో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్