క్రీడాభూమి

చాంపియన్స్ ట్రోఫీ తర్వాత కుంబ్లేపై నిర్ణయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11: ఇంగ్లాండ్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత టీమిండియా కోచ్‌గా అనిల్ కుంబ్లేకు ఉన్న కాంట్రాక్టు పొడిగింపుపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రవి శాస్ర్తీ ఏడాది క్రితం కోచ్‌గా కుంబ్లే పదవీ బాధ్యతలు స్వీకరించాడు. అతని కాంట్రాక్టు వచ్చే నెలతో పూర్తవుతుంది. దానిని పొడిగించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతుండగా, బోర్డు నుంచి ఎలాంటి స్పందన లేదు. చాంపియన్స్ ట్రోఫీ పూర్తయిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటామని బోర్డు వర్గాలు పిటిఐకి తెలిపాయి. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీ్ధర్ కాంట్రాక్టులు ఇప్పటికే పూర్తికాగా, వారిని చాంపియన్స్ ట్రోఫీ ముగిసే వరకూ కొనసాగించాలని బిసిసిఐ నిర్ణయించింది. బోర్డు పాలనా వ్యవహారాలను పరిశీలించడానికి సుప్రీం కోర్టు నియమించిన అధికారుల కమిటీ (సిఒఎ) అనుమతి లేకుండా కాంట్రాక్టులు కుదుర్చుకోవడానికి వీల్లేదన్న వాదన కూడా వినిపిస్తున్నది. అందుకే చాంపియన్స్ ట్రోఫీ ముగిసే వరకూ ఎదురుచూడాలని బిసిసిఐ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, కోచ్‌గా కుంబ్లేను కొనసాగించడానికే ఎక్కువ అవకాశాలున్నాయి.

కెప్టెన్ విరాట్ కోహ్లీతో కోచ్ అనిల్ కుంబ్లే
(ఫైల్ ఫొటో)