క్రీడాభూమి

సిఒఎ అవసరం దీర్ఘ కాలం ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి పాలనాధికారుల బృందం (సిఒఎ) అవసరం ఎక్కువ కాలం ఉండదని దాని చైర్మన్, మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ అభిప్రాయ పడ్డాడు. బోర్డు పాలనా వ్యవహారాలను చక్కదిద్దడంతోపాటు, లోధా కమిటీ ఇచ్చిన సిఫార్సులను తు.చ తప్పకుండా అమలు చేసే బాధ్యతను అప్పగిస్తూ వినోద్ రాయ్ నాయకత్వంలో నలుగురు సభ్యులతో కూడిన సిఒఎను జనవరి 30న సుప్రీం కోర్టు నియమించింది. ఇది బాధ్యతలు చేపట్టి వంద రోజులు పూర్తయిన సందర్భంగా వినోద్ రాయ్ పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడమే తమ బాధ్యతగా చెప్పాడు. అక్టోబర్ మాసాంతంలోగా లోధా సిఫార్సుల అమలు ప్రక్రియ పూర్తవుతుందని అనుకుంటున్నట్టు చెప్పాడు. కాబట్టి సిఒఎ అవసరం బోర్డుకు ఆ తర్వాత ఉండదనే అనుకుంటున్నట్టు చెప్పాడు. లోధా సిఫార్సుల అమలుకు వీలుగా నిబంధనావళిని బిసిసిఐ సవరించాల్సిన అవసరం ఉందని, మిగతా సభ్య సంఘాలు కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లతో సిరీస్‌లకు ముందు బిసిసిఐ సృష్టించిన ఎన్నో అడ్డంకులను సిఒఎ సమర్థంగా అధిగమించింది. చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కు జట్టును ఎంపిక చేయకుండా తాత్సారం చేస్తున్న బిసిసిఐకి అల్టిమేటం జారీ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే, సిఒఎ జోక్యంతోనే చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ఎంపిక పూర్తయింది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్న సిఒఎ త్వరలోనే లోధా కమిటీ సిఫార్సుల అమలు విషయంలోనే అంతే చాకచక్యంతో వ్యవహరించడం ఖాయంగా కనిపిస్తున్నది. బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేపై వేటు వేసిన సుప్రీం కోర్టు వినోద్ రాయ్ చీఫ్‌గా, ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, పారిశ్రామికవేత్త విక్రం లిమాయే, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ సభ్యులుగా సిఒఎను నియమించడం సత్ఫలితాలనిస్తున్నది. ఐపిఎల్‌లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ తర్వాత, దేశ క్రికెట్‌ను పారదర్శంగా ఉండేలా సిఒఎ కీలకంగా వ్యవహరిస్తున్నది. బిసిసిఐ ఒంటెద్దు పోకడలకు ఇప్పుడు క్రమంగా తెరపడుతున్నది. కోట్లాది మంది ఆరాధించే క్రికెట్ చివరికి ఒక వ్యాపారంగా మారిపోతున్న తరుణంలో సిఒఎ నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. అందరూ ఊహించిన విధంగానే బిసిసిఐ పాలన క్రమంగా పారదర్శకంగా మారుతున్నది. అక్టోబర్‌లోగా లోధా కమిటీ సిఫార్సులను పూర్తిగా అమలయ్యేలా చూడడం ద్వారా బిసిసిఐకి సిఒఎ కొత్త రూపాన్ని ఇవ్వనుంది. బోర్డు వ్యవహారం గాడిలో పడిన తర్వాత సిఒఎ అవసరం ఉండదన్న వినోద్ రాయ్ అభిప్రాయం సరైనదే.

చిత్రం..వినోద్ రాయ్