క్రీడాభూమి

‘నాజీ’లపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, మే 12: క్రీడలకు మతంతోగానీ, రాజకీయాలతోగానీ సంబంధం లేదని అంటారు. కానీ, మత విద్వేషం క్రీడలపై విపరీత ప్రభావాన్ని చూపిన సంఘటనలు కోకొల్లలు. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో ఇజ్రాయిల్‌కు చెందిన 11 మంది క్రీడాకారులను అపహరించి బంధించిన పలస్తీనా అనుకూల ఉగ్రవాదులు వారిని దారుణంగా హతమార్చిన సంఘటన అప్పట్లో సంచలనం రేపింది. అంతకు ముందు, ఆ తర్వాత కూడా మత ఉగ్రవాద మూకలు క్రీడలను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతునే ఉన్నాయి. ఇటీవల కాలంలో నాజీ అనుకూల వర్గాల బెడద పెరిగింది. 2014 నుంచి నాజీ జెండాలతో ఊరేగింపులు జరపడం, స్టేడియాలకు వెళ్లి గందరగోళం వాతావరణాన్ని సృష్టించడం ఆనవాయితీగా మారింది. ప్రత్యేకించి, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులున్న సాకర్ మ్యాచ్‌లకు నాజీ పతాకాలతో హాజరవుతున్నారు. గంబా ఒకాసా, సెరెజో ఒకాసా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కి కూడా నాజీ జెండాలతో కొంత మంది రావడం జపాన్ అధికారులను ఆందోళనకు గురి చేసింది. నాజీ మద్దతుదారులపై నిషేధం విధిస్తున్నామని, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. మతం లేదా జాతి ప్రాతిపదికన జపాన్‌లో సాకర్ అభిమానులను మ్యాచ్‌లకు రాకుండా నిషేధించడం ఇదే మొదటిసారి.