క్రీడాభూమి

వెటరన్ క్రీడాకారులకు సాయం పునరుద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: హైదరాబాద్‌లో ఉన్న వెటరన్ క్రీడాకారులకు ఆర్థిక సాయాన్ని తెలంగాణ సర్కారు పునరుద్ధరించించింది. 2015 మార్చిలో వెటరన్ క్రీడాకారులకు ఆర్థిక సాయం అందించే ప్రక్రియను ప్రారంభించారు. ఆరంభంలో పది మందికి ఈ సహాయం లభించింది. కానీ, 2016 ఫిబ్రవరి నుంచి ప్రతినెలా అందుతున్న సాయం నిలిచిపోవడంతో, దీనిని పునరుద్ధరించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె.టి. రామారావును పలువురు కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. తక్షణమే ఆర్థిక సాయాన్ని పునరుద్ధరించాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ బి. జనార్ధన్ రెడ్డిని ఆదేశించారు. దీనితో తొమ్మిది మంది వృద్ధ క్రీడాకారులకు సాయం అందనుంది. ఒలింపిక్స్ లేదా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న వారికి నెలకు 10 వేల రూపాయలు, మాజీ క్రీడాకారులకు నెలకు 7,500 రూపాయలు చొప్పున జిహెచ్‌ఎంసి చెల్లిస్తుంది. ఈ లబ్ధిని పొంది వారిలో మాజీ ఒలింపియన్లు, ఫుట్‌బాల్ ఆటగాళ్లు మహమ్మద్ జుల్ఫకరుద్దీన్, ఐఎస్‌హెచ్‌హెచ్ హమీద్, హాకీ ఇంటర్నేషనల్ కె. సత్యనారాయణ, ఇంటర్నేషనల్ ఫుట్‌బాలర్ బీర్ బహదూర్, బాక్సర్, అర్జున అవార్డు గ్రహీత డెన్నిస్ స్వామి, కబడ్డీ ఆటగాళ్లు ఎసి మల్లేశం, జి. వాసుదేవ్ యాదవ్ తలా పది వేల చొప్పున పొందుతారు. జాతీయ ఖోఖో మాజీ క్రీడాకారుడు చంద్ర ప్రకాష్ బిరాదర్, టెన్నికాయిట్ మాజీ ఇంటర్నేషనల్ సమీరా బేగం నెలకు 7,500 రూపాయలు చొప్పున ఆర్థిక సాయాన్ని పొందుతారు.