క్రీడాభూమి

టెస్టు క్రికెట్‌కు డివిలియర్స్ దూరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేప్ టౌన్, మే 12: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ ఎబి డివిలియర్స్ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం ఖాయంగా కనిపిస్తున్నది. మోచేతి గాయం కారణంగా ఈ ఏడాది జనవరి తర్వాత అతను ఒక్క టెస్టు కూడా ఆడలేదు. దక్షిణాఫ్రికా వనే్డ జట్టుకు నాయకత్వం వహిస్తున్న 33 ఏళ్ల డివిలియర్స్ ఇటీవలే న్యూజిలాండ్‌లో జరిగిన పర్యటన నుంచి వైదొలిగాడు. అదే విధంగా ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండబోనని ప్రకటించాడు. కెరీర్‌లో ఇంత వరకూ 106 టెస్టులు (176 ఇన్నింగ్స్) ఆడిన డివిలియర్స్ 8,074 పరుగులు సాధించాడు. 16 పర్యాయాలు నాటౌట్‌గా నిలిచిన అతనికి ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు 278 (నాటౌట్). అతని స్కోరులో 21 శతకాలు, 39 అర్ధ శతకాలు ఉన్నాయి. 933 ఫోర్లు, 57 సిక్సర్లు కొట్టి, స్ట్రోక్ ప్లేయర్‌గా తనకు ఉన్న పేరును నిలబెట్టుకున్నాడు. 197 క్యాచ్‌లు పట్టాడు. పార్ట్‌టైమ్ వికెట్‌కీపర్‌గా కూడా సేవలు అందించిన అతను ఐదు స్టంపింగ్స్ చేశాడు. కాగా, తరచు గాయాలతో బాధపడుతున్నందున అతను టెస్టు క్రికెట్ నుంచి వైదొలగడం ఖాయమన్న వాదన వినిపిస్తున్నది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ హస్సీ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల్లో డివిలియర్స్ టెస్టు మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదని వ్యాఖ్యానించాడు.

చిత్రం..ఎబి డివిలియర్స్