క్రీడాభూమి

క్వార్టర్స్‌కు భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: ఆసియా బాడ్మింటన్ టీం చాంపియన్‌షిప్‌లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. బుధవారం జరిగిన పోటీల్లో సింగపూర్‌పై 5-0 తేడాతో తిరుగులేని విజయాన్ని నమోదు చేసిన భారత్ మూడు సింగిల్స్, రెండు డబుల్స్ మ్యాచ్‌లు ఆడింది. తొలి సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21-16, 12-21, 21-13 తేడాతో జి లియాంగ్ డెరెక్‌ను ఓడించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న తెలుగు వీరుడు రెండోసెట్‌ను కోల్పోయినప్పటికీ, చివరి సెట్‌లో ఎదురుదాడికి దిగి విజయభేరి మోగించాడు. రెండో సింగిల్స్ మ్యాచ్‌లో అజయ్ జయరామ్ 21-11, 21-18 స్కోరుతో కియెన్ యూ లోను సులభంగా ఓడించాడు. చివరి సింగిల్స్ మ్యాచ్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ 21-10, 21-12 స్కోరుతో జిన్ రెయ్ ర్యాన్‌పై గెలిచాడు. డబుల్స్ విభాగంలో మను అత్రి, సుమీత్ రెడ్డి జోడీ 21-15, 21-14 స్కోరుతో యాంగ్ కెయ్ టెర్రీ, హీ కియాన్ హియాన్ లో జోడీపై గెలిచింది. మరో డబుల్స్ మ్యాచ్‌లో ప్రణవ్ జెర్రీ జోప్రా, ఆక్షయ్ దివాల్కర్ 21-14, 21-13 ఆధిక్యంతో డానీ బవా క్రిస్నాంటా, హెండ్రా విజయా జోడీపై విజయం సాధించారు. ఇతర మ్యాచ్‌ల్లో జపాన్ 5-0 తేడాతో శ్రీలంకను, మలేసియా కూడా ఇదే ఆధిక్యంతో నేపాల్‌ను, హాంకాంగ్ 4-1 తేడాతో ఫిలిప్పీన్స్‌ను ఓడించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాయి.

రూపీందర్ ‘డబుల్’.. కళింగపై ఢిల్లీ విజయం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: స్టార్ ఆటగాడు రూపీందర్‌పాల్ సింగ్ రెండు గోల్స్‌తో రాణించి, కళింగ లాన్సర్స్‌పై ఢిల్లీ వేవ్‌రైడర్స్ 6-0 తేడాతో విజయం సాధించడంతో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ 18వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ను గోల్‌గా మలచిన అతను 33వనిమిషంలో ఫీల్డ్ గోల్ సాధించాడు. మరో నిమిషంలోనే కెపెటన్ సైమన్ చైల్డ్ ద్వారా ఢిల్లీకి మరో గోల్ లభించింది. 56వ నిమిషంలో పర్వీందర్ సింగ్ చేసిన గోల్‌తో ఢిల్లీ తిరుగులేని ఆధిక్యాన్ని సంపా దించింది. రెండు ఫీల్డ్ గోల్స్ సాధించిన కారణంగా రెండు బోనస్ గోల్స్ లభించిన ఢిల్లీ 6-0 తేడాతో కళింగను చి త్తు చేసింది. గోల్స్ కోసం కళింగ ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.