క్రీడాభూమి

గ్రూప్ మ్యాచ్‌లకు నేటితో తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 13: పదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆదివారంతో ముగుస్తాయి. ఇప్పటి వరకూ 54 మ్యాచ్‌లు జరగ్గా, ఆదివారం సాయంత్రం 4 గంటలకు పుణేలో మొదలయ్యే మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లు ఢీ కొంటాయి. ఏమాత్రం ప్రాధాన్యత లేని మరో మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్ మధ్య బెంగళూరులో ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. శనివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుచేసిన డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్‌కు చేరింది. మరోవైపు ముంబయి ఇండియన్స్ జట్టు ఇది వరకే ప్లే ఆఫ్‌లోకి అడుగుపెట్టింది. మిగ తా రెండు స్థానాల కోసం పోటీ కొనసాగుతున్నది.
మొత్తం మీద ఆదివారం నాటి మ్యాచ్‌లతో కలిపి 56 మ్యాచ్‌ల గ్రూప్ దశకు తెరపడుతుంది. 15న విశ్రాంతి దినంకాగా, గ్రూప్ దశలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య 16న మొదటి క్వాలియర్ ఉంటుంది. అందులో విజయం సాధించిన జట్టు ఫైనల్‌లోకి అడుగుపెడుతుంది. మూడు, నాలుగు స్థానాలు ఆక్రమించిన జట్లు 17న ఎలిమినేటర్‌లో తలపడతాయి. ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టుతో మొదటి క్వాలిఫయర్‌లో ఓడిన జట్టు 19న జరిగే రెండో క్వాలిఫయర్‌లో ఢీ కొంటుంది.
ఫైనల్‌కు రిఫరీగా శ్రీనాథ్
ఈనెల 21న హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగే ఫైనల్‌కు మాజీ క్రికెటర్ జవగళ్ శ్రీనాథ్ రిఫరీగా వ్యవహరిస్తాడు. మొదటి క్వాలిఫయర్‌కు కూడా అతనే రిఫరీగా ఉంటాడు. ఫైనల్‌కు ఫీల్డ్ అంపైర్లుగా రవి, నిగెల్ లాంగ్ సేవలు అందిస్తారు. మొత్తం మీద ప్లే ఆఫ్ దశలో జరిగే మ్యాచ్‌లకు మ్యాచ్ రిఫరీలుగా జవగళ్ శ్రీనాథ్, మనూ నాయర్, కల్నల్ చిన్మయ శర్మ, ఫీల్డ్ అంపైర్లుగా రవి, శంషుద్దీన్, నందన్, అశ్వంత్ బర్డే, అనిల్ చౌదరీ, నితిన్ మీనన్, నంద కిషోర్, అనంత పద్మనాభన్, నిగెల్ లాంగ్ బాధ్యతలను పంచుకుంటారని బిసిసిఐ ఒక ప్రకటనలో పేర్కొంది.