క్రీడాభూమి

క్వింటన్ డి కాక్‌కు సిఎస్‌ఎ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహానె్నస్‌బర్గ్, మే 14: దక్షిణాఫ్రికా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ క్వింటన్ డి కాక్‌కు దక్కింది. దక్షిణాఫ్రికా క్రికెట్ (సిఎస్‌ఎ) ప్రకటించిన అవార్డుల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌తోపాటు మరో నాలుగు అవార్డులను కూడా అతను గెల్చుకున్నాడు. వీటిలో టెస్టు క్రికెట్ ఆఫ్ ది ఇయర్, వనే్డ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ కూడా ఉన్నాయి. ఐసిసి వనే్డ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు కూడా అతను నామినేట్ అయ్యాడు. కానీ, అవార్డును దక్కించుకోలేకపోయాడు. లేకపోతే, నిరుడు కాగిసో రబదా అత్యధికంగా ఆరు అవార్డుల రికార్డును సమం చేసేవాడు.

చిత్రం..క్వింటన్ డికాక్