క్రీడాభూమి

స్టార్ అట్రాక్షన్ లాంప్కిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ: గోవాలోని అర్పోరాలో ఈనెల 19, 20 తేదీల్లో జరిగే ఇండియా బైక్ వీక్ (ఐబిడబ్ల్యు) షోలో ఇంగ్లీష్ ప్రొఫెషనల్ మోటార్ సైకిల్ రైడర్ డౌగీ లాంప్కిన్ స్టార్ అట్రాక్షన్‌గా మారనున్నాడు. ఐబిడబ్ల్యులో భాగంగా గోవాలో మోటో ట్రయల్ షోను నిర్వహిస్తామని సెవెన్టీ ఇఎంజి వ్యవస్థాపకుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి మార్టిన్ డా కోస్టా తెలిపాడు. ఈ షోలో లాంప్కిన్ పాల్గొనడం భారత దేశంలోని యువ బైక్ రైడర్లకు కొత్త ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందని బుధవారం పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. కాగా, బైక్ షోలలో అపారమైన అనుభవం ఉన్న లాంప్కిన్‌కు అత్యుత్తమ ప్రదర్శనకారుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. మోటార్ సైకిల్‌పై అతను చేసే విన్యాసాలను చూసేందుకు అభిమానులు భారీగా తరలివస్తారు. మొట్టమొదటిసారి భారత్‌లో ఒక బైక్ షోకు హాజరుకానున్న లాంప్కిన్ ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతాడని నిర్వాహకులు ఆశిస్తున్నారు.

డౌగీ లాంప్కిన్ విన్యాసాలు
(ఫైల్ ఫొటో)