క్రీడాభూమి

పంజాబ్ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, మే 14: పదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ప్లే ఆఫ్ చేరిన జట్లు ఖరారయ్యాయి. తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌ను ఢీకొన్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ దారుణంగా విఫలమై తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు కేవలం 73 పరుగులకే కుప్పకూలడంతో, పుణే సూపర్‌జెయింట్ 12 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 78 పరుగులు చేసి విజయభేరి మోగించి, మొత్తం 18 పాయింట్లతో ప్లే ఆఫ్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ ఆరంభం వరకూ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలబెట్టుకున్న పంజాబ్ కీలక తరుణంలో చేతులెత్తేసింది. దారుణంగా ఓడి, గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. పుణే సూపర్‌జెయింట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ నాలుగు ఓవర్లలో 19 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చడం ద్వారా పంజాబ్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీశాడు. జయదేవ్ ఉనాద్కత్, ఆడం జంపా, డానియల్ క్రిస్టియన్ కూడా సమయోచితమైన స్పెల్స్‌తో రాణించారు.
తొలి బంతికే గుప్టిల్ అవుట్
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పుణే సూపర్‌జెయింట్ అద్వితీయ బౌలింగ్‌తో పంజాబ్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీసింది. మొదటి ఓవర్ మొదతి బంతికే మార్టిన్ గుప్టిల్‌ను మనోజ్ తివారీ క్యాచ్ పట్టగా జయదేవ్ ఉనాద్కత్ అవుట్ చేయడంతో మొదలైన పుణే సూపర్‌జెయింట్స్ వికెట్ల పతనం నిరాటంకంగా కొనసాగింది. షాన్ మార్ష్ 13 బంతుల్లో 10 పరుగులు చేసి, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో స్టీవెన్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగ్గా, ఇంగ్లాండ్ వనే్డ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నాలుగు బంతుల్లో నాలుగు పరుగులు చేసి రనౌటయ్యాడు. రాహుల్ తెవాతియా కూడా కేవలం నాలుగు పరుగులకే అవుటయ్యాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో జయదేవ్ ఉనాద్కత్ చక్కటి క్యాచ్ పట్టడంతో అతని ఇన్నింగ్స్‌కు తెరపడింది. అదే ఓవర్‌లో కెప్టెన్ గ్లేన్ మాక్స్‌వెల్ (0) వికెట్‌ను కూడా శార్దూల్ ఠాకూర్ సాధించాడు. అజింక్య రహానే క్యాచ్ అందుకోవడంతో మాక్స్‌వెల్ మూడో బంతికే వెనుదిరిగాడు. క్రీజ్‌లో నిలిచి, జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించిన ఓపెనర్, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా 13 పరుగులు చేసి అవుటయ్యాడు. 17 బంతుల్లో, ఒక సిక్సర్ సాయంతో 13 పరుగులు చేసిన అతను డానియల్ క్రిస్టిన్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ మహేంద్ర సింగ్ ధోనీకి దొరికిపోయాడు. టాప్ స్కోరర్ అక్షర్ పటేల్ 20 బంతుల్లో, ఒక ఫోర్, మరో సిక్సర్‌తో 22 పరుగులు సాధించి, డానియల్ క్రిస్టియన్ బౌలింగ్‌లోనే, ధోనీనే క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. స్వాప్నిల్ సింగ్ 17 బంతుల్లో 10 పరుగులు చేసిన తర్వాత జయదేవ్ ఉనాద్కత్ బౌలింగ్‌లో ధోనీకే క్యాచ్ అందించి అవుటయ్యడు. మోహిత్ శర్మ (6) వికెట్‌ను డానియల్ క్రిస్టియన్ క్యాచ్ పట్టగా ఆడం జంపా సాధించాడు. ఏ దశలోనూ గట్టిపోటీని ఇవ్వలేకపోయిన పంజాబ్ 15.5 ఓవర్లలో 73 పరుగులకు కుప్పకూలింది. శార్దూల్ ఠాకూర్ 19 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టగా, జయదేవ్ ఉనాద్కత్, ఆడం జంపా, డానియల్ క్రిస్టియన్ తలా రెండు వికెట్లు తీశారు.
తొలుత ఫీల్డింగ్‌కు దిగి, ప్రత్యర్థి భరతం పట్టిన పుణే సూపర్‌జెయంట్
ఆతర్వాత బ్యాటింగ్‌లో తిరుగులేని ఆధిక్యాన్ని కనబరచింది. 12 ఓ వర్లు ఆడి, రాహుల్ త్రిపాఠీ (28) వికెట్ కోల్పోయ లక్ష్యాన్ని చేరిం ది. అజింక్య రహానే 34 (34 బంతులు, ఒక ఫోర్, ఒక సిక్స్), స్టీవెన్ స్మిత్ 15 (18 బంతులు) పరుగులతో నాటౌట్‌గా నిలిచి పుణే విజయాన్ని సంపూర్ణం చేశారు.
*

పదో ఐపిఎల్ గ్రూప్ దశలో మొదటి నాలుగు స్థానాలు సంపాదించిన ముంబయి ఇండియన్స్, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్, డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ప్లే ఆఫ్‌కు దూసుకెళ్లాయి. ఆదివారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను కేవలం 73 పరుగులకు కట్టడి చేసి, 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన పుణే సూపర్‌జెయింట్ మొత్తం తొమ్మిది విజయాలతో 18 పాయింట్లు సంపాదించి, రెండో స్థానంలో నిలిచింది. గ్రూప్ దశలో అన్ని మ్యాచ్‌లను ముగించుకున్న ముంబయి 10 విజయాలతో, 20 పాయింట్లు సంపాదించి అగ్రస్థానాన్ని ఆక్రమించగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ 17 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ 16 పాయింట్లు తన ఖాతాలో వేసుకొని నాలుగో స్థానాన్ని సంపాదించి, ప్లే ఆఫ్‌కు అర్హత సంపాదించింది.
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, గుజరాత్ లయన్స్, నిరుటి రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గ్రూప్ దశలో చివరి నాలుగు స్థానాల పడిపోయ నిష్క్రమించాయ.

చిత్రం..శార్దూల్ ఠాకూర్