క్రీడాభూమి

రమిత్‌కు స్క్వాష్ టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, మే 15: ప్రస్తుతం న్యూయార్క్‌లో నివాసం ఉంటున్న భారత స్క్వాష్ ఆటగాడు రమిత్ టాండన్ ఇక్కడ జరిగిన ఎస్‌వైఎస్ ఓపెన్ టోర్నమెంట్ టైటిల్ సాధించాడు. ఫైనల్‌లో అతను భారత్‌కే చెందిన కుష్ కుమార్‌ను 11-3, 11-2, 11-3 తేడాతో సునాయాసంగా ఓడించాడు. క్వాలిఫయర్‌గా ఈ టోర్నమెంట్‌లో అడుగుపెట్టిన అతను మూడో సీడ్ కుష్‌పై వరుస సెట్లలో గెలవడం విశేషం. కోల్‌కతాకుచెందిన రమిత్ ఆరేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ ప్రొఫెషనల్ స్క్వాష్ క్రీడాకారుడిగా రూపుదిద్దుకుంటున్నాడు. మొట్టమొదటిసారి ప్రొఫెషనల్ టైటిల్‌ను సాధించి, తనకు ఉజ్వల భవిష్యత్తు ఉందని నిరూపించాడు.