క్రీడాభూమి

ముదురుతున్న వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, మే 15: క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ), ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం (ఎసిఎ) మధ్య వివాదం మరింత ముదురుతున్నది. నిన్నటి వరకూ రాజీ ప్రయత్నాలు చేసిన ఎసిఎ ఇప్పుడు ఎదురుదాడికి సిద్ధమైంది. ఆటగాళ్ల కాంట్రాక్టు మొత్తాన్ని పెంచాల్సిందేనని ఎసిఎ డిమాండ్ చేసింది. ఒకవేళ సమస్యకు తెరపడకపోతే, రాబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ను బహిష్కరించే పరిస్థితి కల్పించవద్దని హితవు పలికింది. వివాదాన్ని పరిష్కరించుకోవడానికే ఆటగాళ్లు సుముఖత వ్యక్తం చేస్తున్నారని, వారి న్యాయమైన డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందంచాలని ఎసిఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలిస్టర్ నికల్సన్ సిఎ అధికారులకు సూచించాడు. యాషెస్ సిరీస్‌కు అడ్డంకులు కలిగకుండా చూడాలని పే ర్కొంటూ, ఆటగాళ్లు ఆ సిరీస్‌ను బహిష్కరించే అవకాశాలున్నాయని పరోక్షంగా హెచ్చరించింది. పరి ష్కారం సిఎ చేతుల్లోనే ఉందని స్పష్టం చేసింది.