క్రీడాభూమి

భారత బృందానికి ప్రశంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దక్షిణ ఆసియా క్రీడలు (శాగ్)లో ఎన్నడూ లేని విధంగా మూడు వందలకుపైగా పతకాలను సాధించిన భారత బృందాన్ని కేంద్ర ప్రభుత్వం అభినందించింది. 22 క్రీడలకు సంబంధించిన 226 ఈవెంట్స్‌లో పోటీలు జరగ్గా 2,672 మంది అథ్లెట్లు పతకాల కోసం పోటీపడ్డారు. భారత్ 188 స్వర్ణం, 90 రజతం, 30 కాంస్యాలతో మొత్తం 308 పతకాలను కైవసం చేసుకొని అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ పోటీల 32 ఏళ్ల చరిత్రలో ఏ దేశానికీ ఇన్ని పతకాలు లభించలేదు. మొత్తం 239 స్వర్ణాల కోసం పోటీ జరిగితే, వాటిలో నాలుగింట మూడు వంతుల వంతు పతకాలను తన ఖాతాలో వేసుకున్న భారత్ దక్షిణ ఆసియాలో తనకు తిరుగులేదని నిరూపించుకుంది. శ్రీలంక, పాకిస్తాన్ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. మొత్తం ఎనిమిది దేశాలు పోటీపడిన శాగ్‌లో దాదాపుగా అన్ని ఈవెంట్స్‌లోనూ అగ్రస్థానాన్ని ఆక్రమించిన భారత బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ అభినందించింది. సమావేశం అనంతరం టెలికాం, ఐటి శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ విలేఖరులతో మాట్లాడుతూ భారత అథ్లెట్లు సాధించిన విజయాల పట్ల ప్రధాని సంతోషం వ్యక్తం చేశారని అన్నారు. కేంద్రాలుగా ఎంపికైన ఆరు నెలల స్వల్ప వ్యవధిలోనే గౌహతి, షిల్లాంగ్ అసాధారణ రీతిలో శాగ్‌కు ఆతిథ్యమిచ్చాయని అంటూ, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలను కేబినెట్ అభినందించిందని అన్నారు. శాగ్ నిర్వాహణ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించిన కేంద్ర క్రీడల మంత్రి శర్వానంద సోనోవాల్ కృషి ఫలితంగా ఈవెంట్ విజయవంతమైందని పేర్కొన్నారు. ముందుగా ప్రకటించిన విధంగా భారత క్రీడాకారుల్లో స్వర్ణ పతకం సాధించిన వారికి తలా మూడు లక్షలు, రజత పతకం గెలిచిన వారికి తలా రెండు లక్షలు, కాంస్య పతకాలను సాధించిన వారికి తలా ఒక లక్ష రూపాయలు చొప్పున కేంద్రం బహుమతిగా ఇస్తుందని రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ఈ పోటీల ద్వారా భారత్ క్రీడా శక్తి మరోసారి రుజువైందని పేర్కొన్నారు.