క్రీడాభూమి

దీప్తి, పూనమ్ శతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోచెఫ్‌స్ట్రూమ్, మే 15: నాలుగు దేశాల మహిళల వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌ని భారత జట్టు ఐర్లాండ్‌పై ఏకంగా 249 పరుగుల భారీ తేడాతో గెల్చుకుంది. దీప్తి శర్మ 188 పరుగులు సాధించి రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించగా, మరో ఓపెనర్ పూనమ్ రావత్ కూడా శతకాన్ని సంధించడంతో భారత్ 50 ఓవర్లలో మూడు వికెట్లకు 358 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 40 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ మిథాలీ రాజ్ బ్యాటింగ్ ఎంచుకోగా, ఓపెనర్లు దీప్తి శర్మ, పూనమ్ రావత్ మొదటి వికెట్‌కు 320 పరుగులు జోడించారు. దీప్తి శర్మ 160 బంతులు ఎదుర్కొని, 27 ఫోర్లు, రెండు సిక్సర్లతో 188 పరుగులు సాధించి రికార్డు సృష్టించింది. పూనమ్ రావత్ 116 బంతుల్లో 109 పరుగులు చేసి రిటైర్డ్ అవుటైంది. ఆమె స్కోరులో 11 ఫోర్లు ఉన్నాయి. శిఖా పాండే 27 పరుగులు చేసి రనౌట్‌కాగా, చివరిలో వేదా కృష్ణమూర్తి (8), ఏక్తా బిస్త్ (0) నాటౌట్‌గా నిలిచారు.
అసాధ్యంగా కనిపిస్తున్న భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి ఇన్నింగ్స్ ఆరంభించిన ఐర్లాండ్ ఏ దశలోనూ భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేక పోయింది. మేరీ వాల్డ్రాన్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, లీ పాల్ 13, కెప్టెన్ లారా డెలానీ 25, జెన్నీఫర్ గ్రే 26 చొప్పున పరుగులు చేశారు. మిగతా వారు ఈమాత్రం కూడా స్కోర్లు చేయలేకపోవడంతో ఐర్లాండ్ మరో 60 బంతులు మిగిలి ఉండగానే, 109 పరుగులకు ఆలౌటైంది.
జింబాబ్వేపై దక్షిణాఫ్రికా గెలుపు
పొచెఫ్‌ట్రూమ్: జింబాబ్వేతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 40.2 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. మొడెస్టర్ ముపాచిక్వా 29 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, జోసెఫిన్ నొమో 17 పరుగులు చేసింది. మిగతా వారు రాణించలేకపోవడంతో జింబాబ్వే తక్కువ స్కోరుకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ 14 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. సూన్ లూస్, మసాబతా క్లాస్ చెరి రెండు వికెట్లు సాధించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 21.2 ఓవర్లలో, మూడు వికెట్ల నష్టానికి 114 పరుగులు సాధించి, ఇంకా 172 బంతులు మిగిలి ఉడగానే విజయాన్ని నమోదు చేసింది. లిజెల్లే లీ 17, ఆండ్రి స్టెన్ 22, త్రిషా చెట్టి 19 చొప్పున పరుగులు చేయగా, మిగ్నాన్ డు ప్రీజ్ 22, మరిజానే కాప్ 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచి దక్షిణాఫ్రికాను గెలిపించారు.
రికార్డుల వెల్లువ

* ఈ మ్యాచ్‌లో రికార్డులు వెల్లువెత్తాయి. భారత మూడు వికెట్లకు 358 పరుగులు సాధించి, మహిళల వనే్డ ఇంటర్నేషనల్స్‌లో పదో అత్యధిక స్కోరును నమోదు చేసింది. అయితే భారత జట్టుకు వనే్డల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. కాగా, దీప్తి శర్మ 188 పరుగులు సాధించడం ద్వారా ఒక ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక స్కోరును సాధించింది. 1997 డిసెంబర్ 16న ముంబయిలో డెన్మార్క్‌తో జరిగిన మ్యాచలో ఆస్ట్రేలియా క్రీడాకారిణి బెలిండా క్లార్క్ అజేయంగా 229 పరుగులు సాధించింది. ఆమె తర్వాత భారీ స్కోర్ల జాబితాలో దీప్తి శర్మ రెండో స్థానాన్ని ఆక్రమించింది. అంతేగాక, పూనమ్ రావత్‌తో కలిసి ఆమె మొదటి వికెట్‌కు 320 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. మహిళల వనే్డ చరిత్రలో ఏవికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. 2008 ఆగస్టు 8న లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన సారా టేలర్, కరోలిన్ అట్కిన్స్ 268 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ను నెలకొల్పారు. ఆ భాగస్వామ్యాన్ని దీప్తి శర్మ, పూనమ్ రావత్ బద్దలు చేసి, సరికొత్త రికార్డు సృష్టించారు.

చిత్రం.. తన వనే్డ కెరీర్‌లో వ్యక్తిగత అత్యధిక స్కోరును నమోదు చేయడమేగాక, మహిళల వనే్డ చరిత్రలో రెండో ఉత్తమ స్కోరు (188)ను సాధించిన భారత ఓపెనర్ దీప్త శర్మ