క్రీడాభూమి

నెహ్రా అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా గాయంతో బాధపడుతున్న కారణంగా పదో ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని జట్టు కోచ్ టామ్ మూడీ ప్రకటించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో బుధవారం ఎలిమినేటర్ జరగనున్న నేపథ్యంలో అతను విలేఖరులతో మాట్లాడుతూ నెహ్రా కండరాల నొప్పితో బాధపడుతున్నాడని, ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలిపాడు. ముందు జాగ్రత్త చర్యగా అతనికి మిగతా మ్యాచ్‌ల నుంచి విశ్రాంతినిచ్చినట్టు చెప్పాడు. ఈనెల 6న రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌తో గ్రూప్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు అతను తన రెండో ఓవర్‌లో మొదటి బంతిని వేసిన తర్వాత, కాలి కండరాలు బెణకడంతో బౌలింగ్‌ను కొనసాగించలేకపోయిన విషయాన్ని మూడీ గుర్తుచేశాడు. ఫిట్నెస్ లేకపోవడంతో అతను ఈ టోర్నీలో సన్‌రైజర్స్ ఆడబోయే మ్యాచ్ లేదా మ్యాచ్‌లకు దూరమవుతాడని చెప్పాడు. తరచు గాయాల బారిన పడుతున్న నెహ్రా 2016 సీజన్‌లో సన్‌రైజర్స్ ఆడిన 17 మ్యాచ్‌లకుగాను 8 మ్యాచ్‌ల్లో మాత్రమే బరిలోకి దిగాడు. ఈసారి ఇంత వరకూ జట్టు 14 మ్యాచ్‌లు ఆడితే, అతను ఆరు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. నెహ్రా లేకపోవడంతో, అతని స్థానాన్ని సమర్థంగా భర్తీ చేసే బాధ్యతను మహమ్మద్ సిరాజ్ స్వీకరించాల్సి ఉంటుంది. ఇలావుంటే, యువరాజ్ సింగ్ ఫిట్నెస్‌పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చిత్రం..ఆశిష్ నెహ్రా