క్రీడాభూమి

పాక్ అథ్లెట్ల భద్రతపై స్పష్టతనిచ్చిన శాగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిల్లాంగ్, ఫిబ్రవరి 17: గౌహతి, షిల్లాంగ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన దక్షిణ ఆసియా గేమ్స్ (శాగ్)లో భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచడం ఒక ఎత్తయితే, మన దేశంలో పాకిస్తాన్ అథ్లెట్లకు, క్రీడాకారుల భద్రతకు ఎలాంటి ముప్పు లేదన్న వాస్తవం ప్రపంచానికి తెలియడం మరో ఎత్తు. దీనిని శుభ పరిణామంగానే చెప్పుకోవాలి. ముంబయిపై ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రీడా సంబంధాలకు దాదాపుగా తెరపడింది. రెండు దేశాల్లోనూ కోట్లాది మంది అభిమానులున్న క్రికెట్‌పై అలముకున్న నీలినీడల ప్రభావం మిగతా క్రీడలపైనా పడుతున్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ను ఆడాల్సి ఉండింది. కానీ చివరి క్షణం వరకూ ఎటూ తేల్చకుండా దోబూచులాడిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) పాక్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై దాడి జరిగిన తర్వాత ఆ దేశంలో క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఫలితంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో పాకిస్తాన్ తన హోం సిరీస్‌లను ఆడుతున్నది. కాగా, యుఎఇలో మ్యాచ్‌లు ఆడబోమని ప్రకటించిన బిసిసిఐ ప్రత్యామ్నాయంగా శ్రీలంక పేరును తెరపైకి తెచ్చింది. పరిమిత ఓవర్ల సిరీస్ శ్రీలంకలో జరుగుతుందనే ఆశలు కల్పించింది. చివరిదాకా తాము అదే ఆశాభావంతోనే తాము ఉన్నామని పిసిబి చైర్మన్ షహర్యార్ ఖాన్ పలు సందర్భాల్లో అన్నాడు. భారత్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందనే అనుకున్నట్టు చెప్పాడు. బిసిసిఐ విధించిన షరతులకు అంగీకరించామని, యుఎఇలో కాకుండా శ్రీలంకలో సిరీస్ ఆడేందుకు కూడా సిద్ధమయ్యామని పిసిబి అంటున్నది. తమ సర్కారు నుంచి ఆమోదం ముద్రను వేయించుకుంది. కానీ, భారత్ నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో, ద్వైపాక్షిక క్రీడా సంబంధాలను రద్దు చేసుకుంటామని పిసిబి హెచ్చరించింది. కాగా, క్రికెట్ ప్రభావం మిగతా క్రీడలపైనా పడుతుందని భారత అధికారులు ఆందోళన పడ్డారు. శాగ్‌కు పాకిస్తాన్ బృందం రాదేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే, ఆ అనుమానాలను తారుమారు చేస్తూ పాకిస్తాన్ బృందం శాగ్‌లో పాల్గొంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానాన్ని ఆక్రమించింది. పాకిస్తాన్ పోటీల్లో పాల్గొనడం, భద్రతకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఆ బృందానికి ఎదురుకాకపోవడం మంగళవారం ముగిసిన శాగ్ విజయవంతమైందనడానికి నిదర్శనాలు.
పాక్ అథ్లెట్ల ఆనందం
భారత్‌లో జరిగిన ఒక మెగా క్రీడా ఈవెంట్‌లో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిచ్చిందని పాకిస్తాన్ అథ్లెట్లు సంతోషం వ్యక్తం చేశారు. మూడు వందలకుపైగా సభ్యులతో కూడిన పాకిస్తాన్ బృందం 12 స్వర్ణం, 37 రజతం, 57 కాంస్యాలతో మొత్తం 106 పతకాలను కైవసం చేసుకుంది. భద్రతాపరంగా ఎక్కడా సమస్యలు ఎదురుకాలేదని, స్వదేశంలో ఉన్నంత స్వేచ్ఛగా తాము శాగ్‌లో పాల్గొన్నామని పాక్ అథ్లెట్లు వ్యాఖ్యానించారు. భవిష్యత్తులోనూ భారత్‌లో పోటీల్లో పాల్గొనేందుకు తాము సిద్ధంగా ఉంటామని అన్నారు. అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో పరిస్థితులు ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉంటాయి. తీవ్రవాద దాడులు, కిడ్నాప్‌లు అక్కడ నిత్యకృత్యం. అయితే, శాగ్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ప్రత్యేకించి పాకిస్తాన్ బృందానికి ఎక్కడా అసౌకర్యం సమస్య ఎదురుకాలేదు.