క్రీడాభూమి

కోచింగ్ సదస్సుకు తాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: భారత బాడ్మింటన్ డబుల్స్ విభాగం కోచ్ తాన్ కిమ్ హర్ ఈ ఏడాది ఆగస్టులో గ్లాస్గోలో జరిగే ప్రపంచ కోచింగ్ సదస్సుకు హాజరుకానున్నాడు. అందులో మాట్లాడే అవకాశం లభించిన ఏడుగురు ప్రముఖుల్లో అతను కూడా ఉండడం విశేషం. మలేసియాకు చెందిన తాన్ డబుల్స్ స్పెషలిస్టుగా పేరు సంపాదించాడు. 1996 ఒలింపిక్స్‌లో సెమీస్ వరకూ చేరాడు. థామస్ కప్ టోర్నీలో రజత పతకం సాధించాడు. అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత కోచ్‌గా మారాడు. మలేసియా, ఇంగ్లాండ్, కొరియా దేశాల్లో సేవలు అందించిన అతను ఇప్పుడు భారత జాతీయ డబుల్స్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సదస్సులో కెనెత్ లార్సెన్, జూ హువాయ్‌వెన్, పి. హోంగ్యాన్ తదితరులు కూడా ప్రసంగిస్తారు.