క్రీడాభూమి

భారత్‌లో ఫుట్‌బాల్‌కు పెరుగుతున్న ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 17: భారత దేశంలో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతున్నదని స్పెయిన్ మాజీ క్రీడాకారుడు కార్లెస్ పయోల్ అన్నాడు. అంధేరీలోని ముంబయి ఫుట్‌బాల్ ఎరెనాలో అతను సుమారు 500 మంది పిల్లలతో కలిసి ఆడాడు. వారి నైపుణ్యాన్ని తిలకించారు. అనంతరం అతను మాట్లాడుతూ భారత్‌లో ప్రతిభావంతులు చాలా మంది ఉన్నారని, సాకర్ పట్ల ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారని అన్నాడు. చిన్నతనం నుంచే తల్లిదండ్రులు, పాఠశాలల ప్రోత్సాహం లభిస్తే, అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోగలరని పేర్కొన్నాడు. మన దేశంలో జరిగే ఫిపా అండర్-17 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ స్థానిక నిర్వాహణ కమిటీ డైరెక్టర్ జేవియర్ సెప్పీ మాట్లాడుతూ, దేశంలో ఫుట్‌బాల్ క్రమంగా బలపడుతున్నదని చెప్పాడు. అండర్-17 వరల్డ్ కప్‌తో ఎక్కువ మంది ఈ క్రీడ పట్ల మొగ్గు చూపుతారన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.