క్రీడాభూమి

కోహ్లీ ఫామ్‌లోకి వస్తాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 17: ఇంగ్లాండ్‌లో వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న చాంపియన్స్ ట్రోఫీలో భారత కెప్టెన్ వినాట్ కోహ్లీ రాణిస్తాడని, ఆ సత్తా అతనికి ఉందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ధీమా వ్యక్తం చేశాడు. బుధవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అతను పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో విఫలమైనంత మాత్రాన కోహ్లీ ప్రతిభను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో అతను మళ్లీ ఫామ్‌లోకి వస్తాడన్న నమ్మకం తనకు ఉందన్నాడు. జట్టుకు అతనే కీలక ఆటగాడని కపిల్ స్పష్టం చేశాడు. గత సీజన్‌లో 16 టెస్టులు ఆడి 973 పరుగులు సాధించిన కోహ్లీ పదో ఐపిఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు నాయకత్వం వహించిన అతను అనూహ్యంగా విఫలమయ్యాడు. పది మ్యాచ్‌లు ఆడి 308 పరుగులు చేయగలిగాడు. కోహ్లీ వైఫల్యంతో మానసికంగా కుంగిపోయిన ఇతర ఆటగాళ్లు కూడా రాణించలేదని, ఫలితంగా బెంగళూరు గ్రూప్ దశను చిట్టచివరి స్థానంతో ముగించిందని పరిశీలకుల అభిప్రాయం. ఈ అంశాలను ప్రస్తావించగా, ఒక టోర్నీలో పరుగులు రాబట్టలేనంత మాత్రాన అవే వైఫల్యాలు కొనసాగుతాయని అనుకోవడానికి వీల్లేదని కపిల్ అన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్ మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి మేటి స్టార్లతో భారత బౌలింగ్ పటిష్టంగా ఉందన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ నిలబెట్టుకునే అవకాశాలు భారత్‌కు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.