క్రీడాభూమి

ఎలిమినేటర్‌కు వర్షం బెడద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 17: డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య బుధవారం రాత్రి 8 గంటలకు ప్రారంభమైన పదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ ఎలిమినేటర్‌కు వర్షం వల్ల అంతరాయం ఏర్పడింది. భారీగా జల్లులు కురవడంతో మైదానాన్ని కవర్లతో కప్పేశారు. ఒక దశలో జ ల్లులు తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా, తిరిగి పుంజు కోవడంతో ఆట నిలిచిపోయంది. అంతకు ముందు జరిగి న ఆటలో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబా ద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 128 పరుగులు మాత్రమే చేయ గలిగింది. కెప్టెన్ వార్నర్ తప్ప అందరూ విఫలమయ్యారు.
టాప్ స్కోరర్ వార్నర్
పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న సన్‌రైజర్స్ అత్యంత కీలకమైన ఎలిమినేటర్‌లో అనూహ్యంగా చతికిలబడింది. పరుగుల వరద పారించే సత్తావున్న శిఖర్ ధావన్ 13 బంతులు ఎదుర్కొని, 11 పరుగులు చేసి, ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ రాబిన్ ఉతప్ప క్యాచ్ పట్టగా అవుట్ కావడంతో 25 పరుగుల వద్ద తొలి వికెట్ పడింది. కేన్ విలియమ్‌సన్ కొద్దిసేపు నైట్ రైడర్స్ బౌలింగ్‌కు ఎదురు నిలిచాడు. 26 బంతులు ఎదుర్కొన్న అతను రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 24 పరుగులు చేసి, నాథన్ కౌల్టల్ నైల్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ అందుకోవడంతో వెనుదిరిగాడు. ఈ సీజన్‌లో అద్భుతంగా ఆడుతూ, టాప్ స్కోరర్ల జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన సహజమైన ఆటకు భిన్నంగా బంతులు మింగేశాడు. క్రీజ్‌లో నిలిచేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన తను 35 బంతుల్లో 37 పరుగులు చేసిన తర్వాత పీయూష్ చావ్లా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతని స్కోరులో రెండు ఫోర్లు, మరో రెండు సిక్సర్లు ఉన్నాయి. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో అతనే టాప్ స్కోరర్ కావడం గమనార్హం. యువరాజ్ సింగ్ (9)ను పీయూష్ చావ్లా క్యాచ్ పట్టగా ఉమేష్ యాదవ్ అవుట్ చేశాడు. ధాటిగా ఆడుతున్న విజయ్ శంకర్ (17 బంతుల్లో 22 పరుగులు)ను సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ అందుకోగా అవుట్ చేసిన నాథన్ కౌల్టర్ నైల్ అదే ఓవర్‌లో క్రిస్ జోర్డాన్ (0)ను రిటర్స్ క్యాచ్ అందుకొని పెవిలియన్‌కు పంపాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి, క్రిస్ లిన్‌కు క్యాచ్ ఇచ్చి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో నమన్ ఓఝా (16) అవుటయ్యాడు. సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 128 పరుగులకు పరిమితమైంది. నాథన్ కౌల్టన్ నైల్ నాలుగు ఓవర్లలో 20 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. సన్‌రైజర్స్‌ను అతనితోపాటు ఉమేష్ యాదవ్ (21 పరుగులకు 2 వికెట్లు) కూడా కట్టడి చేయగలిగాడు. కాగా, ఈ మ్యాచ్‌ని భారత కాలమానం ప్రకారం బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత కొనసాగించే అవకా శాలు ఉన్నాయని నిర్వాహకులు ప్రకటించారు. 20 ఓవర్ల మ్యాచ్ సాధ్యం కాదని ఇప్పటికే స్పష్టమైంది. కాబట్టి ఐదు ఓవర్లకు కుదించవచ్చు. అదీ సాధ్యపడకుంటే, గ్రూప్ దశలో నైట్ రైడర్స్ కంటే మెరుగైన స్థితిలో ఉన్న సన్‌రైజ ర్స్ రెండో క్వాలిఫర్‌కు చేరుతుంది.
photo...
కవర్లతో గ్రౌండ్స్‌మెన్ పరుగులు