క్రీడాభూమి

మలింగ ఫిట్నెస్‌పై శ్రీలంక ఆందోళన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 17: ఇండియన్ ప్రీమియల్ లీగ్ (ఐపిఎల్)పై శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ ప్రభావం అంతా ఇంతా కాదు. ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను ఈ టోర్నీలోని కీలక బౌలర్లలో ఒకడు. నిరుడు గాయం కారణంగా అతను ఐపిఎల్‌లో పాల్గొనలేకపోయాడు. 2015లో మోకాలికి బలమైన గాయం తగలడంతో, లంక తరఫున ఒక్క వనే్డ ఇంటర్నేషనల్‌ను కూడా ఆడలేకపోయిన అతను నిరుడు ఐపిఎల్‌లో ఆడేందుకు సిద్ధపడ్డాడు. పూర్తిగా కోలుకున్నానని ప్రకటించాడు. కానీ, టోర్నీ మొదలయ్యే సమయానికి ఫిట్నెస్‌ను నిరూపించుకోలేకపోయాడు. లంక జాతీయ జట్టుకు కూడా దూరమైన అతను తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఆస్ట్రేలియాతో జరిగిన టి-20 సిరీస్‌తో మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టాడు. ఇంగ్లాండ్‌లో జరగే చాంపియన్స్ ట్రోఫీలో అతను కీలక పాత్ర పోషిస్తాడని శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) ఆశిస్తున్నది. మలింగ జట్టులో లేకపోవడంతో, అనేక పరాజయాలను ఎదుర్కొన్న లంకకు అతని అవసరం బాగా అర్థమైంది. సుమారు రెండేళ్లుగా లంక అటు టి-20, ఇటు వనే్డ ఇంటర్నేషనల్స్ ఫార్మాట్స్‌లో దారుణంగా విఫలమవుతూ వస్తున్నది. మలింగ జట్టులో లేనందుకే ఈ పరాభవాలు ఎదురవుతున్నాయని ఎస్‌ఎల్‌సి అనుమానిస్తున్నది. అందుకే, ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ టోర్నీలో అతనినే వజ్రాయుధంగా ఉపయోగించాలని చూస్తున్నది. అయితే, ప్రస్తుతం ఐపిఎల్‌లో ఆడుతున్న అతను నిలకడగా రాణించలేకపోవడం ఎస్‌ఎల్‌సి అధికారులను ఆందోళనకు గురి చేస్తన్నది. కొన్ని మ్యాచ్‌ల్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న మలింగ మరికొన్ని మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమవుతున్నాయి. వికెట్లు పడగొడుతున్నా, పరుగులు కూడా ధారాళంగానే ఇస్తున్నాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో, నాలుగు ఓవర్లలో 58 పరుగుల సమర్పించుకోవడం మలింగ ఫిట్నెస్‌పై అనుమానాలకు కారణమవుతున్నది. పూర్తి ఫిట్నెస్ లేకుండానే అతను ఐపిఎల్‌కు వచ్చాడన్న వాదన బలంగా వినిపిస్తున్నది. నిజానిజాలు ఎలావున్నా, అతని నిలకడలేమి అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే, ఎస్‌ఎల్‌సి భయానికి తగిన కారణం ఉందనే అనుకోవాలి.