క్రీడాభూమి

అర్ధరాత్రి మ్యాచ్‌లా? నైట్ రైడర్స్ పేసర్ కౌల్టర్ నైల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 18: అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఒక క్రికెట్ మ్యాచ్ ఆడడం ఎవరికైనా కష్టమేనని కోల్‌కతా నైట్ రైడర్స్ పేసర్ నాథన్ కౌల్టన్ నైల్ వ్యాఖ్యానించాడు. సన్‌రైజర్స్‌తో ఎలిమినేటర్ బుధవారం అర్ధరాత్రి 1.30 గంటలకు ముగిసిన విషయాన్ని అతను ప్రస్తావిస్తూ, ఈ విషయంలో నిబంధనలను మార్చాల్సిన అవసరం ఉందన్నాడు. రాత్రి 12.40 గంటల ప్రాంతంలో చివరిసారి పరిస్థితిని గమనించడానికి అంపైర్లు మైదానంలోకి వెళ్లినప్పుడు తాను చాలా ఆందోళనకు గురయ్యానని అన్నాడు. అర్ధరాత్రి దాటినప్పటికీ ఆటను కొనసాగించడం సరైన నిర్ణయం కాదని వ్యాఖ్యానించాడు. నిర్వాహకులు ఈ అంశంపై దృష్టి పెట్టాలని ఎలిమినేటర్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన కౌల్టన్ నైల్ కోరాడు. అతను నాలుగు ఓవర్లలో 20 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ కారణంగానే సన్‌రైజర్స్ భారీ స్కోరు చేయలేకపోయంది.