క్రీడాభూమి

ఒలింపిక్స్ కోసం కాదు.. నా కోసమే ఆడుతున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకొని తాను మళ్లీ టెన్నిస్ ఆడుతున్నానని వచ్చిన వార్తలను భారత వెటరన్ టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి తోసిపుచ్చాడు. తన కోసమే తాను మళ్లీ కోర్టులోకి దిగినట్టు చెప్పాడు. భారత టాప్ ర్యాంకర్ యుకీ భంబ్రీతో కలిసి ఢిల్లీ ఓపెన్‌లో భూపతి పోటీపడుతున్నాడు. దీనితో అతను మళ్లీ ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగుపెట్టబోతున్నాడని, ఈఏడాది రియోలో జరిగే ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకొని పోటీలకు హాజరవుతున్నాడని వార్తలు వెలువడ్డాయి. అయితే, ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ భూపతి స్పష్టం చేశాడు. గాయాల కారణంగా కొంతకాలం టెన్నిస్‌కు దూరమయ్యానని, ఆటపై ఉన్న మక్కువతో మళ్లీ మ్యాచ్‌లకు సిద్ధపడ్డానని వివరించాడు. వచ్చేనెల దుబాయ్‌లో జరిగే టోర్నీలోనూ ఆడతానని చెప్పాడు. ఒకవేళ శరీరం సహకరించకపోతే విశ్రాంతి తీసుకుంటానని అన్నాడు. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటిఎఫ్) నిబంధనల ప్రకారం తొమ్మిది నెలల కంటే ఎక్కువ కాలం టోర్నీలకు దూరమైతే, ఎంట్రీ ప్రొటెక్షన్, ప్రొటెక్టెడ్ ర్యాంకింగ్‌లను సగటు పాయింట్ల ఆధారంగా నిర్ధారిస్తారు. అయితే, తనకు ఈ నిబంధనల గురించిన వివరాలు తెలియవని భూపతి అన్నాడు. ఫిట్నెస్ సక్రమంగా లేనందునే టెన్నిస్‌కు కొంతకాలం దూరమయ్యానని, ఇప్పుడు గాయాల నుంచి కోలుకున్నందున మళ్లీ పోటీలకు దిగుతున్నానని చెప్పాడు. ర్యాంకింగ్స్ కోసంగానీ, ఒలింపిక్స్ లేదా ఇతర టోర్నీలను దృష్టిలో ఉంచుకొనిగానీ తాను మ్యాచ్‌లకు సిద్ధం కాలేదని అన్నాడు. ఆట సంతృప్తినిచ్చినంత కాలం కెరీర్‌ను కొనసాగిస్తానని తెలిపాడు. టెన్నిస్ ఇక ఆడలేనని నిర్ధారణకు వచ్చిన వెంటనే ఆటకు దూరమవుతానని చెప్పాడు.