క్రీడాభూమి

రిజర్వ్ రోజు ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: ఐపిఎల్‌లో గ్రూప్ దశ మ్యాచ్‌లు ఎలావున్నా, ప్లే ఆఫ్ దశలో జరిగే మ్యాచ్‌లకు తప్పనిసరిగా రిజర్వ్ రోజు ఉండాలని కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ సూచించాడు. బుధవారం అర్ధరాత్రి దాటే వరకూ సాగిన ఐపిఎల్ ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌పై నైట్ రైడర్స్ గెలవడం ఆనందాన్నిచ్చిందని చెప్పాడు. అయితే, చివరి క్షణం వరకూ తాను ఎంతో ఒత్తిడికి గురయ్యానని అన్నాడు. ఏవైనా అనుకోని పరిస్థితుల్లో ఒక మ్యాచ్‌ని ఆసాంతం కొనసాగించడం కుదరకపోతే, రిజర్వ్ డేకు వాయిదా వేయాలని అన్నాడు. గంటల తరబడి నిరీక్షించడం, అర్ధ రాత్రి తర్వాత మ్యాచ్‌లు ఆడడం వల్ల ఆటగాళ్లు కూడా శారీరకంగా, మానసికంగా అలసిపోతారని చెప్పాడు.
20 ఓవర్లు ఆడి ఉంటే..
బెంగళూరు: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 20 ఓవర్లు ఆడి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్, శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అన్నాడు. వర్షం కారణంగా నైట్ రైడర్స్ లక్ష్యాన్ని ఆరు ఓవర్లలో 48 పరుగులుగా నిర్ధారించడంతో ఫలితం తమకు అనుకూలంగా రాలేదన్నాడు. తొలత బ్యాటింగ్‌కు దిగిన తమ జట్టు 128 పరుగులకే పరిమితం కావడంపై స్పందిస్తూ, మరో పదిపదిహేను పరుగులు చేసి ఉంటే బాగుండేదన్నాడు. అయినప్పటికీ, ఆ స్కోరును పరిరక్షించుకోవడం అసాధ్యమేమీ కాదని, కానీ, 20 ఓవర్ల ఆట సాధ్యం కాకపోవడంతో తమ ప్రయత్నాలు ఫలించలేదని పేర్కొన్నాడు. మొత్తం మీద పదో ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ ఆట తీరు సంతృప్తికరంగానే ఉందన్నాడు.