క్రీడాభూమి

మోసగాళ్లపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంట్‌గొమెరీ, మే 19: క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ, విజయాల కోసం అక్రమ విధానాలను అనుసరించే బాక్సర్లపై ఉక్కుపాదం మోపాలని అంతర్జాతీయ బాక్సింగ్ అధికారులను డబ్ల్యుబిసి హెవీవెయిట్ చాంపియన్ డొంటే విల్డర్ డిమాండ్ చేశాడు. బాక్సింగ్ పూర్తిగా పతనం కాకముందే మేల్కొని, క్రీడను రక్షించేందుకు సరైన చర్యలు తీసుకోవాలని సూచించాడు. అలెగ్జాండర్ పొవెట్కిన్, ఆండ్రెజ్ వావ్రిజిక్‌లతో అతను బౌట్స్‌లో పాల్గొనాల్సి ఉంది. కానీ, వారిద్దరూ నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించి, డోప్ పరీక్షలో విఫలం కావడంతో ఆ ఫైట్స్ రద్దయ్యాయి. పొవెట్కిన్‌తో బౌట్ లేనందువల్ల తాను ఐదు మిలియన్ డాలర్లు (సుమారు 3.25 కోట్ల రూపాయలు) నష్టపోయాననీ, ఈ మొత్తాన్ని నిర్వాహకుల నుంచి ఇప్పించాలని విల్డర్ కోర్టులో కేసు వేశాడు. న్యాయమూర్తి తనకు అనుకూలంగా ఇచ్చిన తీర్పుపై అతను స్పందిస్తూ, డోప్ లేదా ఇతరత్రా అడ్డదారుల్లో అందలం ఎక్కాలనుకునే వారిని కఠినంగా శిక్షిస్తే తప్ప బాక్సింగ్ క్రీడకు మంచి రోజులు రావని వ్యాఖ్యానించాడు. ఆలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు, అందరినీ అనుమానంతో చూడడం అలవాటవుతుందని చెప్పాడు. బాక్సర్లు, బాక్సింగ్‌పై అభిమానులు నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. అందుకే, ఏదో ఒక మార్గంలో మోసాలకు పాల్పడే బాక్సర్లపై కఠినంగా వ్యవహరించడం ద్వారా, భవిష్యత్తులో ఎవరూ అలాంటి అక్రమాలకు పాల్పడకుండా జాగ్రత్త పడాలని అన్నాడు. కెరీర్‌లో ఇప్పటి వరకూ 37 ఫైట్స్‌లో పాల్గొన్న విల్డర్, ఒక్క ఓటమి కూడా లేకుండా అన్నింటినీ గెల్చుకున్నాడు. అతని విజయాల్లో 36 నాటౌట్ ద్వారా లభించినవే కావడం విశేషం.