క్రీడాభూమి

నిన్న సునీత.. నేడు నవ్‌జోత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్, మే 19: భారత డిఫెండర్ సునీత లాక్రా కెరీర్‌లో వంద అంతర్జాతీయ మ్యాచ్‌లను పూర్తి చేసుకోగా, ఆ జాబితాలో తాజాగా మిడ్‌ఫీల్డర్ నవ్‌జోత్ కౌర్ చేరింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భాగంగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఆమె ఆడింది. నవ్‌జోత్‌కు ఇది వందో ఇంటర్నేషనల్ మ్యాచ్. 2012లో న్యూజిలాండ్‌తోనే నాపీర్‌లో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన నవ్‌జోత్ తన అద్భుత ప్రతిభతో, జట్టులో కీలక క్రీడాకారిణిగా ఎదిగింది. మిడ్‌ఫీల్డర్‌గా భారత మహిళా హాకీ జట్టుకు మెరుగైన సేవలు అందిస్తున్నది. కురుక్షేత్రలో జన్మించిన ఈ యువ క్రీడాకారిణి ఆసియా క్రీడలు, రియో ఒలింపిక్స్, ఆసియా చాంపియన్స్ ట్రోఫీ వంటి పలు ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో ఆడింది.
నాలుగో ఓటమి
ఇలావుంటే, న్యూజిలాండ్ చేతిలో భారత్ వరుసగా నాలుగో పరాజయాన్ని చవిచూసింది. తాజా మ్యాచ్‌లో 0-3 తేడాతో ఓడింది. రాచెల్ మెక్‌కాన్ 14వ నిమిషంలో కివీస్‌కు తొలి గోల్‌ను అందించింది. 17వ నిమిషంలో టెస్సా జోప్ గోల్ సాధించగా, 26వ నిమిషంలో రాచెల్ మెక్‌కాన్ మరో గోల్ చేసి న్యూజిలాండ్‌కు తిరుగులేది ఆధిక్యాన్ని అందించింది. ఆతర్వాత కివీస్ వ్యూహాత్మకంగా రక్షణాత్మక విధానాన్ని అనుసరించడంతో భారత్‌కు ఒక్క గోల్ చేసే అవకాశం కూడా దక్కలేదు.