క్రీడాభూమి

నైట్ రైడర్స్ ఫ్లాప్ షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 19: పదో ఐపిఎల్‌లో మొదటి రెండు స్థానాలు ఆక్రమించిన జట్లే ఫైనల్‌లో పోరా డనున్నాయ. గ్రూప్ దశలో మొదటి స్థానాన్ని సంపాదించిన ముంబయి ఇండియన్స్ మొదటి క్వాలిఫయర్‌లో రెండో స్థానంలో ఉన్న రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. అయితే, రెండో క్వాలిఫయర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఆరు వికెట్ల తేఆడాతో చిత్తుచేసి ఫైనల్‌లో చోటు సంపాదించింది. ప్రత్యర్థిని 107 పరుగులకే కట్టడి చేసి, ఆతర్వాత లక్ష్యాన్ని మరో 33 బంతులు మిగిలి ఉండగానే, నాలుగు వికె ట్లు కోల్పోయ చేరుకోవడం ద్వారా ఈనెల 21న హైదరాబాద్‌లో పుణే సూపర్‌జెయింట్‌తో ఆఖరి యుద్ధాన్ని ఖరారు చేసుకుంది. కర్న్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ ధాటికి విలవిల్లాడిన నైట్ రైడర్స్ ఏ దశలోనూ గట్టి పోటీని ఇవ్వలేక, టోర్నీ నుంచి నిష్క్రమించింది.
టాస్ తమకు అనుకూలంగా రావడంతో, లక్ష్యాన్ని ఛేదించడమే సులభమన్న ఉద్దేశంతో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అతని వ్యూహం సత్ఫలితాన్నిచ్చింది. హార్డ్ హిట్టర్ క్రిస్ లిన్ (4)ను కీరన్ పొలార్డ్ క్యాచ్ పట్టగా అవుట్ చేసిన జస్‌ప్రీత్ బుమ్రా నైట్ రైడర్స్‌ను తొలి దెబ్బతీశాడు. లిన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన స్టార్ స్పిన్నర్ సునీల్ నారైన్ 10 బంతులు ఎదుర్కొని, 10 పరుగులు చేశాడు. కర్న్ శర్మ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించిన అతను సకాలంలో క్రీజ్‌లోకి చేరుకోలేకపోవడంతో వికెట్‌కీపర్ పార్థీవ్ పటేల్ స్టంప్ చేయడంతో వెనుదిరిగాడు. అప్పటికి నైట్ రైడర్స్ స్కోరు 24 పరుగులు. మరో పరుగు తర్వాత రాబిన్ ఉతప్ప కూడా పెవిలియన్ చేరాడు. మూడు బంతులు ఎదుర్కొని, ఒక పరుగు చేసిన అతనిని జస్‌ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజ్‌లో నిలబడతాడనుకున్న కెప్టెన్ గౌతం గంభీర్ 15 బంతులు ఆడి, 12 పరుగులు చేశాడు. కర్న్ శర్మ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య చక్కటి క్యాచ్ అందుకోగా అతని పోరాటానికి తెరపడింది. అదే ఓవర్‌లో కొలిన్ డి గ్రాండ్‌హోమ్ (0)ను కర్న్ శర్మ ఎల్‌బిగా అవుట్ చేశాడు. 31 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన నైట్ రైడర్స్ చిక్కుల్లో పడింది. ఇశాంత్ జగ్గీ, టాప్ స్కోరర్ సూర్య కుమార్ యాదవ్ అవుట్ కాకుండా ఉండేందుకు విపరీతంగా శ్రమించారు. కానీ, కర్న్ శర్మ బౌలింగ్‌లో ఇశాంత్ జగ్గీ అవుటయ్యాడు. 31 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్ల సాయంతో 28 పరుగులు చేసిన అతను ఇచ్చిన క్యాచ్‌ని మిచెల్ జాన్సన్ అందుకున్నాడు. పీయూష్ చావ్లా (2), నాథన్ కౌల్టర్ నైల్ (6) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. జట్టు స్కోరు వంద పరుగుల మైలురాయిని దాటడంలో కీలక పాత్రపోషించిన సూర్య కుమార్ యాదవ్ 25 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31 పరుగులు చేసి, జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో లసిత్ మలింగకు చిక్కాడు. అంకిత్ రాజ్‌పుత్ (4)ను లసిత్ మలింగ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో, 18.5 ఓవర్లలో 107 పరుగుల వద్ద నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. ఉమేష్ యాదవ్ రెండు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కర్న్ శర్మ నాలుగు ఓవర్లలో 16 పరుగులకు నాలుగు వికెట్లు కూల్చగా, జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లలో కేవలం ఏడు పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు. ఆరంభంలోనే అతను రెండు వికెట్లు కూల్చి నైట్ రైడర్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. మిచెల్ జాన్సన్‌కు రెండు వికెట్లు లభించాయి.
ఆడుతూ.. పాడుతూ..
నైట్ రైడర్స్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ముంబయ ఇండియన్స్ జట్టు ఏ విధమైన ఇబ్బంది లేకుండా, ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం 11 పరుగుల వద్ద ఓపెనర్ లెండల్ సిమన్స్ (3), మరో 13 పరుగుల తర్వాత పార్థీవ్ పటేల్ (14) వికెట్లు కోల్పోయనా, 34 పరుగుల వద్ద అంబటి రాయుడు (6) వెనుదిరిగినా ఈ జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ, కృణాల్ పాండ్య అండగా నిలిచారు. నాలుగో వికెట్‌కు వీరు 54 పరుగులు జోడించడంతో ముంబయ లక్ష్యానికి చేరువైంది. 24 బంతులు ఎదుర్కొన్న రోహిత్ ఒక ఫోర్, మరో సిక్సర్‌తో 26 పరుగులు సాధించి, నాథన్ కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో అంకిత్ రాజ్‌పుత్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. కృణాల్ పాండ్య (30 బంతుల్లో 45), కీరన్ పొలార్డ్ (7 బంతుల్లో 9) మరో వికెట్ కూలకుండా, 14.3 ఓవర్లలో ముంబయకి విజయాన్ని అందించారు. ఇంకా 33 బంతులు మిగిలి ఉండగానే ఈ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి, ఫైనల్‌కు దూసుకెళ్లింది.
రెండో క్వాలిఫయర్ స్కోరుబోర్డు
కోల్‌కతా నైట్ రైడర్స్: క్రిస్ లిన్ సి కీరన్ పొలార్డ్ బి జస్‌ప్రీత్ బుమ్రా 4, సునీల్ నారైన్ స్టంప్డ్ పార్థీవ్ పటేల్ బి కర్న్ శర్మ 10, గౌతం గంభీర్ సి హార్దిక్ పాండ్య బి కర్న శర్మ 12, రాబిన్ ఉతప్ప ఎల్‌బి జస్‌ప్రీత్ బుమ్రా 1, ఇశాంక్ జగ్గీ సి మిచెల్ జాన్సన్ బి కర్న్ శర్మ 28, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ ఎల్‌బి కర్న్ శర్మ 0, సూర్య కుమార్ యాదవ్ సి లసిత్ మలింగ బి జస్‌ప్రీత్ బుమ్రా 31, పీయూష్ చావ్లా సి అంబటి రాయుడు బి మిచెల్ జాన్సన్ 2, నాథన్ కౌల్టర్ నైల్ సి హార్దిక్ పాండ్య బి మిచెల్ జాన్సన్ 6, ఉమేష్ యాదవ్ 2 నాటౌట్, అంకిత్ రాజ్‌పుత్ బి లసిత్ మలింగ 4, ఎక్‌స్ట్రాలు 7, మొత్తం (18.5 ఓవర్లలో ఆలౌట్) 107.
వికెట్ల పతనం: 1-5, 2-24, 3-25, 4-31, 5-31, 6-87, 7-94, 8-100, 9-101, 10-107.
బౌలింగ్: మిచెల్ జాన్సన్ 4-0-28-2, జస్‌ప్రీత్ బుమ్రా 3-1-7-3, లసిత్ మలింగ 3.5-0-24-1, కర్న్ శర్మ 4-0-16-4, కృణాల్ పాండ్య 3-0-25-0, హార్దిక్ పాండ్య 1-0-4-0.
ముంబయ ఇండియన్స్: లెండల్ సిమన్స్ ఎల్‌బి పీయూష్ చావ్లా 3, పార్థీవ్ పటేల్ సి రాబిన్ ఉతప్ప బి ఉమేష్ యాదవ్ 14, అంబటి రాయుడు బి పీయూష్ చావ్లా 6, రోహిత్ శర్మ సి అంకిత్ రాజ్‌పుత్ బి నాథన్ కౌల్టర్ నైల్ 26, కృణాల్ పాండ్య 45 నాటౌట్, కీరన్ పొలార్డ్ 9 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 8, మొత్తం (14.3 ఓవర్లలో 4 వికెట్లకు) 111.
వికెట్ల పతనం: 1-11, 2-24, 3-34, 4-88.
బౌలింగ్: ఉమేష్ యాదవ్ 2.3-0-20-1, పీయూష్ చావ్లా 4-0-34-2, నాథన్ కౌల్టర్ నైల్ 3-0-15-1, సునీల్ నారైన్ 4-0-21-0, అంకిత్ రాజ్‌పుత్ 1-0-14-0.

ఎవరూ అనుకోని రీతిలో బౌలింగ్ చేసి, నాలుగు వికెట్లు పడగొట్టిన ముంబయ ఇండియన్స్ స్పిన్నర్ కర్న్ శర్మ. అతని బౌలింగ్ ప్రతిభే నైట్ రైడర్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చింది

మొదటి క్వాలిఫయర్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయంట్ చేతిలో అనూహ్యంగా ఓడిన ముంబయ ఇండియన్స్, పాయంట్ల పట్టికలో మొదటి స్థానాన్ని సంపాదించిన కారణంగా లభించిన రెండో అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో క్వాలిఫయర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తు చేయడం ద్వారా ఈసారి టైటిల్‌ను దక్కించుకునే అవకాశాలు తనకే ఎక్కువగా ఉన్నాయని నిరూపించుకుంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని ఈ జట్టు మొదటి క్వాలిఫయర్‌లోనే పుణే సూపర్‌జెయంట్‌పై హాట్ ఫేవరిట్‌గా దిగింది. కానీ, ఎవరూ ఊహించని రీతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. ఆ ఓటమితో జాగ్రత్తపడి, రెండో క్వాలిఫయర్‌లో సర్వశక్తులు ఒడ్డింది. ఈసారి విజేతగా నిలిచే అవకాశం తనకు ఉందని పుణే సూపర్‌జెయంట్‌కు హెచ్చరికలు జారీ చేసింది.

ఇన్నింగ్స్ ఆరంభంలోనే క్రిస్ లిన్ వికెట్ పడగొట్టి, నైట్ రైడర్స్‌ను దెబ్బతీసిన ముంబయ ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా. అతను మూడు ఓవర్లు బౌల్ చేసి, కేవలం ఏడు పరుగులిచ్చాడు. మూడు వికెట్లు సాధించి, నైట్ రైడర్స్ పతనానికి కారకుడయ్యాడు

రెండో క్వాలిఫయర్ పోటాపోటీగా ఉంటుందని ఊహించిన క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిలింది. గౌతం గంభీర్ కెప్టెన్‌గా ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ గట్టిపోటీని ఇవ్వకుండానే చేతులెత్తేసింది. కర్న్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ సామర్థ్యం ముంబయ ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించింది. వీరిద్దరూ నైట్ రైడర్స్‌ను 107 పరుగులకే కట్టడి చేయడంతో, ఆతర్వాత ముంబయ విజయం లాంఛనమైంది. ఈ జట్టు ఇన్నింగ్స్ ప్రారంభించక ముందే విజేతగా నిలుస్తుందనేది స్పష్టమైంది. చివరికి అనుకున్నట్టే అయంది.