క్రీడాభూమి

ఢిల్లీ ఓపెన్ ఎటిపి.. సెమీస్‌కు భూపతి-యుకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కెరీర్‌లో తొలిసారి జట్టుగా కలసి ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి, వర్థమాన ఆటగాడు యుకీ బాంబ్రీతో పాటు డిఫెండింగ్ చాంపియన్లు సాకేత్ మైనేని-సనమ్ సింగ్ ఢిల్లీ ఓపెన్ ఎటిపి టోర్నమెంట్‌లో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. న్యూఢిల్లీలోని డిఎల్‌టిఎ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్ పోరులో భూపతి-బాంబ్రీ వరుస సెట్ల తేడాతో యన్నిక్ మెర్టెన్స్ (బెల్జియం), స్టీఫెన్ రాబర్ట్ (ఫ్రాన్స్) జోడిపై విజయం సాధించారు. ఆరంభంలో ప్రత్యర్ధుల నుంచి తీవ్రమైన పోటీ ఎదురైనప్పటికీ 7-5 తేడాతో తొలి సెట్‌ను కైవసం చేసుకున్న భూపతి, బాంబ్రీ ఆ తర్వాత రెండో సెట్‌లో విజృంభించి 6-1 తేడాతో మెర్టెన్స్, రాబర్ట్ జోడీని మట్టికరిపించారు. ఫైనల్‌లో స్థానం కోసం వీరు జిమీ వాంగ్-జీ జంగ్ జోడీతో తలపడనున్నారు. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో జిమీ వాంగ్-జీ జంగ్ 6-1, 6-4 తేడాతో భారత వైల్డ్‌కార్డ్ జోడీ మొహిత్ మయూర్ ప్రకాష్-కాజా వినాయక శర్మపై విజయం సాధించారు.
కాగా, పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్లు సాకేత్ మైనేని-సనమ్ సింగ్ వరుస సెట్ల తేడాతో ప్రత్యర్ధులను మట్టికరిపించారు. భారత్‌కే చెందిన విజయ్ సుందర్ ప్రశాంత్-జీవన్ నెడుంచెజియన్ జోడీతో జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్-సనమ్ 7-6, 6-4 తేడాతో విజయం సాధించారు. సెమీస్‌లో వీరు దివిజ్ శరణ్-్ఫ్లవియో సిపొల్లా జోడీతో తలపడతారు. బెల్జియం జోడీ జోరిస్ డీ లూర్-కిమ్మర్ కొప్పెజాన్స్‌లతో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ పోరులో వాకోవర్ లభించడంతో దివిజ్ శరణ్-్ఫ్లవియో సిపొల్లా సెమీస్‌కు చేరుకున్నారు. ఉదర సంబంధ సమస్య వల్ల కొప్పెజాన్స్ క్వార్టర్ ఫైనల్ బరిలోకి దిగలేకపోవడంతో దివిజ్ శరణ్-్ఫ్లవియో సిపొల్లా జోడీకి వాకోవర్ లభించింది.
క్వార్టర్స్‌కు చేరిన ప్రజ్ఞేష్
ఇదిలావుంటే, సింగిల్స్ విభాగంలో భారత ఆటగాడు ప్రజ్ఞేష్ గుణేశ్వరన్ వాకోవర్ ద్వారా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. రెండో రౌండ్‌లో ఏడో సీడ్ ఆటగాడు యాన్ బయి (చైనా) ఉదర సంబంధ సమస్యతో వైదొలగడంతో ప్రజ్ఞేష్‌కు వాకోవర్ లభించింది. దీంతో అతను సెమీస్ బెర్తు కోసం రెండో సీడ్ ఆటగాడు కిమ్మర్ కిప్పెజాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. రెండో రౌండ్ పోరులో కిప్పెజాన్స్ 6-2, 6-4 సెట్ల తేడాతో మాక్సిమ్ జాన్వియర్‌ను మట్టికరిపించాడు.

ఎఫ్ ఈవెంట్‌లో
అంకితకు సెమీస్ బెర్తు
ఇదిలావుంటే, ఢిల్లీ ఓపెన్ ఐటిఎఫ్ ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి అంకితా రైనా సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇంతకుముందు రెండో రౌండ్ మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న అంకిత గురువారం మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ పోరులో మరింత మెరుగైన ప్రదర్శనతో రాణించి రష్యాకు చెందిన అన్నా మోర్గినాను వరుస సెట్ల తేడాతో మట్టికరిపించింది. పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ పోరులో అంకిత 6-2, 6-0 తేడాతో విజయం సాధించి కేవలం 58 నిమిషాల్లోనే ప్రత్యర్ధిని చిత్తు చేసింది. ఇటీవల ఔరంగాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకోవడంతో పాటు ఫెడ్ కప్ టోర్నీలో టాప్-60 క్రీడాకారిణి నావో హిబినోను ఓడించి కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్న అంకిత ప్రస్తుతం ఫైనల్ బెర్తు కోసం ఉజ్బెకిస్తాన్ క్రీడాకారిణి సబీనా షిరిపోవాతో తలపడనుంది. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో సబీనా షిరిపోవా 6-3, 6-3 సెట్ల తేడాతో తైపీకి చెందిన యా హుసాన్ లీపై విజయం సాధించింది.