క్రీడాభూమి

వెంటాడిన దురదృష్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుమానాలకు లాజిక్కు ఉండదు. పదో ఐపిఎల్‌లో నిరుటి విజేత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఎలిమినేటర్‌లో ఓడడానికి బెంగళూరులో కురిసిన వర్షం ఒక కారణమైతే, జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ప్రతిభ మరో కారణమని అభిమానులు వాదిస్తున్నారు. ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో రైజింగ్ పుణే సూపర్‌జెయంట్‌ను ఓడించిన ముంబయ ఇండియన్స్ టైటిల్ సాధించడాన్ని అందరూ సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తే, సన్‌రైజర్స్ లేదన్న నిరాశ చాలా మంది అభిమానుల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది.

హైదరాబాద్, మే 22: పదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను దురదృష్టం వెంటాడింది. మిగతా జట్లతో పోలిస్తే, ఎక్కువ గ్రూప్ మ్యాచ్‌ల్లో ఈ జట్టు నిలకడగా రాణించింది. జట్టులోని ఆటగాళ్లంతా బాధ్యతాయుతంగా ఆడడంతో అసాధ్యమనుకున్న కొన్ని మ్యాచ్‌లు సన్‌రైజర్స్ ఖాతాలో చేరాయి. కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యంగా ఆడి, పరాజయాలను మూటగట్టుకున్నప్పటికీ, స్థూలంగా చూస్తే డేవిడ్ వార్నర్ నాయకత్వం వహించిన సన్‌రైజర్స్ ఆటతీరు మెరుగ్గానే ఉంది. టైటిల్ రేసులో ఉందనుకున్న ఈ జట్టు ఫైనల్ చేరుకోలేకపోవడానికి ప్రయత్న లోపం లేదు. అందుకే, దురదృష్టం వెంటాడడం వల్లే ఫైనల్‌లో స్థానం సంపాదించలేకపోయిందని అభిమానులు నమ్ముతున్నారు. ఒకటికి రెండుసార్లు సన్‌రైజర్స్‌ను బెంగళూరు దెబ్బతీసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గత నెల 25న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా బౌల్ కాకుండానే రద్దయింది. అంతకు ముందు, ఈసారి టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న బెంగళూరును 35 పరుగుల తేడాతో ఓడించిన సన్‌రైజర్స్, ఆ జట్టుపై రెండో మ్యాచ్‌కి గెలుపుపై ధీమాతో సిద్ధమైంది. కానీ, వార్నర్ బృందం ఆశలపై వర్షం నీళ్లు చెల్లింది. తిరిగి అదే మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఎలిమినేటర్‌లో తలపడిన సన్‌రైజర్స్‌ను మరోసారి వర్షం రూపంలో దురదృష్టం వెక్కిరించింది. మొదటి మ్యాచ్‌లో గెలిచి, బెంగళూరుతో మ్యాచ్ రద్దుకాగా, గ్రూప్ దశలో జరిగిన మిగతా 12 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ ఏడు విజయాలు సాధించింది. ఐదు పరాజయాలను చవిచూసింది. ఏప్రిల్ 8న గుజరాత్‌ను 9 వికెట్లు తేడాతో ఓడించిన ఈ జట్టు 12న ముంబయితో జరిగిన మ్యాచ్‌ని నాలుగు వికెట్ల తేడాతో చేజార్చుకుంది. 14న కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో 17 పరుగవుల తేడాతో ఓడింది. అయితే, ఆతర్వాత పుంజుకొని, 17న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను ఐదు పరుగుల తేడాతో ఓడించింది. అదే జోరును కొనసాగిస్తూ, 19న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 15 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. కానీ, 22న రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడింది. వెంటనే కోలుకొని, 28న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై 26 పరుగుల తేడాతో గెలిచింది. 30న టైటిల్ ఫేవరిట్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 48 పరుగుల తేడాతో చిత్తుచేసి, అందుకు ముందు ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. మే 2న ఢిల్లీ డేర్‌డెవిల్స్ చేతిలో అనూహ్యంగా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 6న రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌ను ఎదుర్కొని, 12 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. 8న జరిగిన మ్యాచ్‌లో అద్వితీయ ప్రతిభ కనబరచి, టైటిల్ రేసులో ఉన్న మరో పటిష్టమైన జట్టు ముంబయి ఇండియన్స్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. అత్యంత కీలకంగా మారిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌ను మరో 11 బంతులు మిగిలి ఉండగానే, ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుచేసి, ప్లే ఆఫ్ దశకు చేరింది. కానీ, ఎలిమినేటర్‌లో చిదంబరం స్టేడియంలో దురదృష్టం ఈ జట్టును వెంటాడింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, పిచ్ తీరు బౌలింగ్‌కు అనుకూలించడం వల్లే వార్నర్ బృందానికి భారీ స్కోరు సాధ్యం కాలేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. నైట్ రైడర్స్‌కు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందనే అంతా అనుకున్నారు. కానీ, వర్షం వల్ల ఆటకు అంతరాయం ఏర్పడగా, అర్ధ రాత్రి దాటిన తర్వాత ఆటను కొనసాగించిన అధికారులు డక్‌వర్త్ లూయిస్ విధానంలో నైట్ రైడర్స్ లక్ష్యాన్ని ఆరు ఓవర్లలో 48 పరుగులుగా నిర్ధారించారు. గౌతం గంభీర్ కెప్టెన్సీ వహిస్తున్న నైట్ రైడర్స్ 5.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి రెండో క్వాలిఫయర్‌కు అర్హత సంపాదించగా, ఎలిమినేటర్‌లో ఓడిన సన్‌రైజర్స్ ఇంటిదారి పట్టింది.
ఆరెంజ్ క్యాప్‌తోనూ..
సన్‌రైజర్స్‌ను వెంటాడిన దురదృష్టానికి ఆరెంజ్ క్యాప్‌ను మరో కారణమన్న అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతున్నది. టోర్నీలో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ ఎలిమినేటర్ జరిగే సమయానికి వార్నర్ వద్ద ఉంది. ఐపిఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ తమ వద్ద ఉన్న కెప్టెన్లు ఎవరూ టైటిల్‌ను అందుకోలేకపోయారు. కెప్టెన్లుగా 2010లో సచిన్ తెండూల్కర్ (ముంబయి ఇండియన్స్/ 572 పరుగులు), 2015లో డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్/ 562 పరుగులు), 2016లో విరాట్ కోహ్లీ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు/ 973 పరుగులు) ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నారు. కానీ, ట్రోఫీలను అందుకోలేకపోయారు. 2015లో వార్నర్ సేన ప్లే ఆఫ్ దశకు కూడా చేరుకోలేపోయింది. కాగా, చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించిన ముంబయి ఇండియన్స్ టైటిల్ సాధించింది. 2016లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 973 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. కానీ, అతను నాయకత్వం వహించిన బెంగళూరు ఫైనల్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓటమిపాలైంది. మొత్తం మీద ఆరెంజ్ క్యాచ్‌ను నెత్తిన పెట్టుకున్న కెప్టెన్లు ఐపిఎల్ ట్రోఫీని అందుకోలేకపోయారని, ఈ దురదృష్టమే వార్నర్‌ను వెంటాడిందన్న వాదన బలంగా వినిపిస్తున్నది. నిజయానికి కెప్టెనే్ల కాదు.. ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్న ఆటగాళ్లు ప్రాతినిథ్యం వహించిన జట్లకు కూడా ఆయా ఐపిఎల్ టోర్నీల్లో టైటిల్ దక్కలేదు. ఈ జాబితా నుంచి రాబిన్ ఉతప్పను మాత్రం మినహాయించాలి. 2008లో షాన్ మార్ష్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్), 2009లో మాథ్యూ హేడెన్ (చెన్నై సూపర్ కింగ్స్), 2010లో సచిన్ తెండూల్కర్ (ముంబయి ఇండియన్స్), 2011 తిరిగి 2012లో క్రిస్ గేల్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), 2013లో మైఖేల్ హస్సీ (చెన్నై సూపర్ కింగ్స్), 2014లో రాబిన్ ఉతప్ప (కోల్‌కతా నైట్ రైడర్స్), 2015లో డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), 2016లో విరాట్ కోహ్లీ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), ఈ ఏడాది డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) ఆరెంజ్ క్యాప్‌ను సాధించారు. వీరిలో రాబిన్ ఉతప్ప తప్ప ఒక్కడే ఒక సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెల్చుకోవడంతోపాటు, ఐపిఎల్ ట్రోఫీని కూడా దక్కించుకున్నాడు. మొత్తం మీద ఆరెంజ్ క్యాప్ కూడా సన్‌రైజర్స్ దురదృష్టానికి కారణమైందని ఆ జట్టు అభిమానులు వాపోతున్నారు.

టాపర్లు వీరే..
హైదరాబాద్, మే 22: పదో ఐపిఎల్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించిన టాప్-15 ఆటగాళ్ల టాప్-5లో ఆరుగురు భారతీయులకు చోటు దక్కింది. అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లో డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) 641 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆతర్వాత నాలుగు స్థానాలను వరుసగా గౌతం గంభీర్ (కోల్‌కతా నైట్ రైడర్స్/ 498), శిఖర్ ధావన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్/ 479), స్టీవెన్ స్మిత్ (రైజింగ్ పుణే సూపర్‌జెయింట్/ 472), సురేష్ రైనా (గుజరాత్ లయన్స్/ 442) ఉన్నారు. మొత్తం టాప్ ఫైవ్‌లో ముగ్గురు భారతీయులే కావడం విశేషం. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే, మొదటి మూడు స్థానాలు భారతీయలకే దక్కాయి. భువనేశ్వర్ కుమార్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) 26 వికెట్లతో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించాడు. జయదేవ్ ఉనాద్కత్ (రైజింగ్ పుణే సూపర్‌జెయింట్/ 24), జస్‌ప్రీత్ బుమ్రా (ముంబయి ఇండియన్స్/ 20) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. మిచెల్ మెక్‌క్లీనగన్ (ముంబయి ఇండియన్స్/ 19), ఇమ్రాన్ తాహిర్ (రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ 18) నాలుగు, ఐదు స్థానాలు దక్కించుకున్నారు.
కాగా, ఈ ఐపిఎల్‌లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌లో ఇద్దరు భారతీయులు ఉన్నారు. గ్లేన్ మాక్స్‌వెల్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) 26, డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) 26 సిక్సర్లతో మొదటి స్థానాన్ని పంచుకుంటున్నారు. రిషభ్ పంత్ (్ఢల్లీ డేర్‌డెవిల్స్) 24, కీరన్ పొలార్డ్ (ముంబయి ఇండియన్స్) 22, రాబిన్ ఉతప్ప (కోల్‌కతా నైట్ రైడర్స్) 21 చొప్పున సిక్సర్లు కొట్టారు.