క్రీడాభూమి

సచిన్ బయోపిక్ ప్రీమియర్‌కు హేమాహేమీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 24: భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ బయోపిక్ ప్రీమియర్ షోకు హేమాహేమీలు హాజరయ్యారు. సచిన్, అతని భార్య అంజలి స్వయంగా ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ఆహ్వానించారు. బాలీవుడ్ నటులు అబితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ తదితరులు ఈ ప్రత్యేక షోను తిలకించారు. క్రికెట ర్లు యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్య, ప్రముఖ గాయని ఆశా భోస్లే, బాక్సర్ విజేందర్ సింగ్, ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, కుమారుడు ఆకాష్ అంబా నీ, అతని చిన్ననాటి కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ తదిత రులు కూడా హాజరయ్యారు. సచిన్ కుమారుడు అర్జున్, కుమార్తె సారా స్టార్ అట్రాక్షన్‌గా నిలిచారు.

వివరాలు ఇవ్వండి
డోప్ కేసుపై కోచ్‌లకు ఎఎఫ్‌ఐ ఆదేశం

న్యూఢిల్లీ, మే 24: ఒక అథ్లెట్ నిషిద్ధ మాదక ద్రవ్యం ‘మెల్డోనియం’ను వినియోగించినట్టు రుజువుకావడంతో అతనపై జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) సస్పెన్షన్ విధించడంపై భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఎఎఫ్‌ఐ) తీవ్రంగా స్పందించింది. పేరు వెల్లడించడానికి నిరాకరించినప్పటికీ, పటియాలాలోని జాతీయ క్రీడా సంస్థలో శిక్షణ పొందుతున్న ఒక అథ్లెట్ ఉత్ప్రేరకాన్ని వాడినట్టు వాడా ప్రకటించింది. అతనిని వెంటనే సస్పెండ్ చేశామని, పదుపరి చర్యలను ప్రకటించే వరకూ అతను ఏ స్థాయి పోటీల్లోనూ పాల్గొనరాదని స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో డోప్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఎఎఫ్‌ఐ ఆందోళనకు గురవుతున్నది. శిక్షణ శిబిరంలో ఉన్న ఒక అథ్లెట్‌కు మెల్డోనియం ఏ విధంగా లభించిందో వివరించాలని కోచ్‌లను ఆదేశించింది. ఈ సంఘటనపై పూర్తి వివరాలు ఇవ్వాలని కోరింది. ఇలావుంటే, పటియాలా శిబిరంలో డోప్ పరీక్షలు నిర్వహించామని, ఒక అథ్లెట్ నిషిద్ధ మాల్డోనియంను వాడినట్టు స్పష్టమైందని వాడా చీఫ్ నవీన్ అగర్వాల్ తెలిపాడు. బుధవారం అతను విలేఖరులతో మాట్లాడుతూ ఈ ఉత్ప్రేరకాన్ని వాడిన సంఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయని అన్నాడు. డోపింగ్ నిరోధక క్రమశిక్షణ విభాగం నిబంధనలను అనుసరించి, డోపింగ్‌కు పాల్పడిన వారిని నాలుగేళ్ల వరకూ సస్పెండ్ చేసే అవకాశం ఉంటుందన్నాడు. 2015లో సవరించిన నిబంధనావళి ప్రకారం ఇప్పటి వరకూ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని వివరించాడు.
రియో ఒలింపిక్స్‌కు ఎంపికైన స్ప్రింటర్ ధరమ్‌వీర్ సింగ్ డోప్ పరీక్షలో విఫలమైన కారణంగా ఎఎఫ్‌ఐ అతనిని అనుమతించలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అథ్లెటిక్స్‌లో డోపింగ్ కేసులు బయటపడుతునే ఉన్నాయి. తాజా సంఘటన ఎఎఫ్‌ఐని ఆందోళనకు గురి చేస్తున్నది. డోప్ కేసులకు కారణాలను కనుక్కొని, సరైన దిశగా చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నది. అందుకే, కోచ్‌లను నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.