క్రీడాభూమి

వచ్చే ఐపిఎల్‌లో భారీ మార్పులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 25: పదో ఐపిఎల్ ముగిసింది. ఎన్నో పొగడ్తలను, అదే స్థాయిలో తెగడ్తలను తన లో ఇముడ్చుకుంది. మొత్తం మీద, ఏదో ఒక సంచలనం సృష్టిస్తూ, సరికొత్త అందాలను ఆవిష్కరిస్తూ పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఐపిఎల్ కు భారీ స్పందనే లభించింది. వచ్చే ఏడాది భారీ మా ర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయ. ఏడాది తర్వాత, ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందో ఎవరి ఊహకూ అంతుబట్టడం లేదు. నారీ మార్పులు ఏవీ ఉండవనే ఆశిద్దాం. బిసిసిఐ వ్యవహారాలను చూసేందుకు సుప్రీం కోర్టు నియమించిన పాలనాధికారుల బృందం (సిఒఎ) తీసుకునే నిర్ణయాలు ఐపిఎల్‌పై ఏ విధమైన ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడే చెప్పలేం. అంతేకాదు, గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ జట్లు వచ్చే ఏడాది ఉండేది కూడా అనుమానమే. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో చెనె్న సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌పై రెండేళ్ల సస్పెన్షన్ వేటు పడడంతో తెరపైకి వచ్చిన గుజరాత్, పుణే సూపర్‌జెయింట్ కనుమరుగు కావచ్చు. వచ్చే ఏడాది చెన్నై, రాజస్థాన్ జట్లు మళ్లీ రంగ ప్రవేశం చేస్తాయి. ఎనిమిది జట్లతోనే ఐపిఎల్‌ను నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయిస్తే, గుజరాత్, పుణే సూపర్‌జెయింట్ కథ ముగిసినట్టే. ఒకవేళ జట్ల సంఖ్యను పదికి పెంచాలని తీర్మానించినా, మిగతా పోటీదారులతోపాటు ఈ రెండు జట్లు కూడా బిడ్స్‌లో పాల్గొనాలి. అందులో నెగ్గితేనే వచ్చే ఐపిఎల్‌లో అవకాశం దక్కుతుంది. స్థూలంగా చూస్తే, వచ్చే ఏడాది చోటు చేసుకోబోయే ఎన్నో మార్పులకు పదో ఐపిఎల్ వేదికైంది.
రైనా, మలింగ టాప్
పదో ఐపిఎల్ ముగిసే సమయానికి బ్యాటింగ్‌లో సురేష్ రైనా, బౌలింగ్‌లో లసిత్ మలింగ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. రైనా 157 ఇన్నింగ్స్‌లో 4,540, విరాట్ కోహ్లీ 141 ఇన్నింగ్స్‌లో 4,418, రోహిత్ శర్మ 154 ఇన్నింగ్స్‌లో 4,207 చొప్పున పరుగులు సాధించి, మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. అదే విధంగా, మలింగ 110 ఇన్నింగ్స్‌లో 154, అమిత్ మిశ్రా 126 ఇన్నింగ్స్‌లో 134, హర్భజన్ సింగ్ 134 ఇన్నింగ్స్‌లో 127 చొప్పున వికెట్లు సాధించి, మొదటి మూడు స్థానాలను ఆక్రమించారు.
సూపర్ వికెట్‌కీపర్ కార్తీక్
ఒక వికెట్‌కీపర్ అత్యధిక డిస్మిసల్స్ విషయంలో మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును దినేష్ కార్తీక్ అధిమించాడు. అతను మొత్తం 106 డిస్మిసల్స్ (80 క్యాచ్‌లు, 26 స్టంపింగ్స్)తో అగ్రస్థానంలో నిలిస్తే, ధోనీ 102 డిస్మిసల్స్ (72 క్యాచ్‌లు, 30 స్టంపింగ్స్) రెండో స్థానాన్ని ఆక్రమించాడు. మూడో స్థానంలో ఉన్న రాబిన్ ఉతప్ప 90 డిస్మిసల్స్ (58 క్యాచ్‌లు, 32 స్టంపింగ్స్) సాధించాడు.
భారీ విజయం
ఐపిఎల్ చరిత్రలోనే భారీ విజయం కూడా ఈసారి టోర్నీలోనే నమోదుకావడం విశేషం. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను 146 పరుగుల తేడాతో చిత్తుచేసిన ముంబయి ఇండియన్స్ ఈ రికార్డును సొంతం చేసుకుంది. నిరుడు గుజరాత్ లయన్స్‌ను 144 పరుగుల తేడాతో ఓడించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రికార్డును అధిగమించి, నంబర్ వన్ స్థానంలో నిలిచింది.

* భారీ ఛేజింగ్స్‌లో రెండో స్థానం ఈసారి ఐపిఎల్‌లో గుజరాత్ లయన్స్ దక్కించుకుంది. 2008లో డక్కన్ చార్జర్స్‌పై ఏడు వికెట్లకు 217 పరుగులు సాధించడం ద్వారా రాజస్థాన్ రాయల్స్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిస్తే, తాజా ఐపిఎల్‌లో గుజరాత్ లయన్స్‌పై ఢిల్లీ డేర్‌డెవిల్స్ మూడు వికెట్లకు 214 పరుగులు చేసి, విజయాన్ని నమోదు చేయడం ద్వారా రెండో స్థానాన్ని సంపాదించుకుంది.
* ఎక్కువ డాట్ బాల్స్ ఆడిన వారి జాబితాలో మొదటి మూడు స్థానాలను ప్రవీణ్ కుమార్ (1,075), హర్భజన్ సింగ్ (1,062), లసిత్ మలింగ (1,060) ఉన్నారు. ఐపిఎల్ అంటేనే బ్యాట్‌తో విరుచుకుపడడం అనే సిద్ధాంతానికి విరుద్ధంగా వీరు పరుగులు చేయకుండా ఎక్కువ బంతులను మింగేశారు.
* ప్రత్యర్థి జట్లకు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయిడిన్ ఓవర్లు వేయడం సులభం కాదు. అయితే, ఎక్కువ మెయిడిన్లు వేసిన రికార్డును ప్రవీణ్ కుమార్ దక్కించుకున్నాడు. అతను 14 మెయిడిన్లను బౌల్ చేయగా, ఇర్ఫాన్ పఠాన్ 10 మెయిడిన్లతో రెండో స్థానంలో ఉన్నాడు. లసిత్ మలింగ, సందీప్ శర్మ చెరి ఎనిమిది మెయిడిన్లతో సంయుక్తంగా మూడో స్థానాన్ని పంచుకుంటున్నారు.