క్రీడాభూమి

కార్యవర్గం వివరాలు వెంటనే ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 25: కార్యవర్గ సభ్యుల వివరాలతో కూడిన జాబితాను వెంటనే సమర్పించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సభ్య సంఘాలను బోర్డు పాలనాధికారుల బృందం (సిఒఎ) ఆదేశించింది. కార్యవర్గ సభ్యుల పేర్లతోపాటు, వారు ఎప్పటి వరకూ పదవిలో ఉంటారనే విషయాన్ని కూడా తప్పనిసరిగా పేర్కొవాలని అన్ని యూనిట్లకు రాసిన లేఖలో తెలిపింది. ఇది వరకు కూడా సిఒఎ ఇలాంటి లేఖనే పంపింది. కానీ, లోధా కమిటీ చేసిన సిఫార్సులపై తమకు స్పష్టమైన అవగాహన లేదంటూ, ఎక్కువ శాతం సభ్య సంఘాలు వివరాలు ఇవ్వలేదు. అయితే, ఈసారి సరైన సమాధానం లేకపోతే, సుప్రీం కోర్టు ద్వారా ఆదేశాలు ఇప్పించే అవకాశాలున్నాయి.

భారత్‌కే టైటిల్
మాజీ స్పిన్నర్ ప్రసన్న
న్యూఢిల్లీ, మే 25: చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను టీమిండియా నిలబెట్టుకుంటుందని భారత మాజీ స్పిన్నర్ ఎర్రాపల్లి ప్రసన్న జోస్యం చెప్పాడు. నాలుగేళ్ల క్రితం సాధించిన ట్రోఫీతోనే మళ్లీ స్వదేశానికి వస్తుందని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు. జట్టు అన్ని రకాలుగానూ సమతూకంతో ఉన్నదని, అందుకే చాంపియన్స్ ట్రోఫీని సాధిస్తుందన్న నమ్మకం పెరిగిందని చెప్పాడు. రవిచంద్ర అశ్విన్, రవీంద్ర జడేజా మంచి ఫామ్‌లో ఉన్నారని, ఇంగ్లాండ్ పిచ్‌లపై వారు గొప్పగా రాణించే అవకాశాలున్నాయని అన్నాడు. 2013లో భారత జట్టు టైటిల్ సాధించినప్పుడు జడేజా 12, అశ్విన్ 8 చొప్పున వికెట్లు సాధించిన విషయాన్ని అతను గుర్తుచేశాడు. కుల్దీప్ యాదవ్ ఎంత వరకు నిలకడగా రాణిస్తాడన్నది చూడాలని చెప్పాడు.

మాంచెస్టర్ యునైటెడ్‌కు
‘యూరోపా’ టైటిల్
స్టాక్‌హోమ్, మే 25: మాంచెస్టర్ యునైటెడ్ జట్టు ప్రతిష్ఠాత్మక యూరోపా లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అజక్స్‌తో జరిగిన మ్యాచ్‌ని ఈ జట్టు 2-0 తేడాతో గెల్చుకుంది. 18వ నిమిషంలో పాల్ పోగ్బా, 48వ నిమిషంలో హెన్రిక్ మిటార్యన్ గోల్స్ సాధించి, మాంచెస్టర్ యునైటెడ్‌ను విజయపథంలో నడిపారు. ఈ ప్రాంతంలోనే ఆత్మాహుతి దాడి జరిగిన 48 గంటల్లోనే నిర్వహించిన టైటిల్ పోరును తిలకించేందుకు వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. ఆ దాడిలో 22 మంది మృతి చెందారు. మాంచెస్టర్ యునైటెడ్ ట్రోఫీని అందుకున్న వెంటనే, ఉగ్రవాద దాడి మృతులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు వౌనం పాటించింది. ఆతర్వాత అభిమానులు, ఆటగాళ్లు సంబరాలు జరుపుకొన్నారు.

రేసులో మేమూ ఉన్నాం
బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తాజా ధీమా
డబ్లిన్, మే 25: చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ రేసులో తాము కూడా ఉన్నామని బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ మష్రాఫ్ మొర్తాజా ధీమా ధీమా వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించడం తమ ఆత్మస్థైర్యాన్ని పెంచిందని విలేఖరులతో మాట్లాడుతూ మొర్తాజా అన్నాడు. ఏ టోర్నీకైనా వామప్ మ్యాచ్‌లు చాలా కీలకమని చెప్పాడు. ఇంగ్లాండ్‌లో పిచ్‌లు చాలా భిన్నంగా ఉంటాయని అంగీకరిస్తూనే, పాకిస్తాన్, భారత్ జట్ల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని చెప్పాడు. తాజా వనే్డ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 50 ఓవర్లలో మూడు వికెట్లకు 270 పరుగులు సాధించింది. టామ్ లాథమ్ (84), నీల్ బ్రూమ్ (63), రాస్ టేలర్ (60 నాటౌట్) అర్ధ శతకాలు సాధించారు. కాగా, లక్ష్యాన్ని ఛేదించడానికి ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ ఒకానొక దశలో 199 పరుగులకే ఆదు వికెట్లు కోల్పోయింది. అయితే, ఆతర్వాత మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ, మరో పది బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతూ, చాంపియన్స్ ట్రోఫీకి అవసరమైన ప్రాక్టీస్ ఈ మ్యాచ్‌లో లభించిందని చెప్పాడు. మేటి జట్లకు కూడా గట్టిపోటీని ఇవ్వగలమని నిరూపించుకున్నామని, మినీ వరల్డ్ కప్‌లోనూ రాణిస్తామని అన్నాడు.