క్రీడాభూమి

పదో ఐపిఎల్ కోటీశ్వరుల గ్రాఫ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: పదో ఐపిఎల్‌లో అత్యధికంగా సొమ్ము చేస్తున్న క్రికెటర్లు తమకు లభించిన మొత్తానికి న్యాయం చేశారా లేదా అన్నది నిర్ణయించాలంటే, వారు ఆడిన తీరును పరిశీలించాలి. ఈసారి ఐపిఎల్‌లో అందరి కంటే ఎక్కువగా, 14.5 కోట్ల రూపాయలతో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ రికార్డు సృష్టించాడు. రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ తరఫున ఆడిన అతను ప్లే ఆఫ్ కంటే ముందుగానే స్వదేశానికి వెళ్లిపోయాడు. మొత్తం మీద అతను 12 మ్యాచ్‌లు ఆడి 316 పరుగులు చేశాడు. 12 వికెట్లు కూల్చాడు. గుజరాత్ లయన్స్‌పై 63 బంతుల్లో 103 పరుగులు చేసి, సెంచరీ హీరోల సరసన స్థానం సంపాదించాడు. ఇక, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన మరో ఇంగ్లాండ్ ఆటగాడు టైమల్ మిల్స్ 12 కోట్ల రూపాయలు దక్కించుకున్నాడు. మిచెల్ జాన్సన్ గాయపడడంతో, అతని స్థానంలోకి వచ్చిన మిల్స్ ఐదు వికెట్లు కూల్చాడు. అంటే అతను పడగొట్టిన ఒక్కో వికెట్ ధర 2.9 కోట్ల రూపాయలు. ఐదు కోట్ల ధర పలికిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ పేసర్ కాగిసో రబదా ఆరు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు సాధించాడు. ఇతని ఒక్కో వికెట్ ధర సుమారు 83 లక్షల రూపాయలు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన ట్రెంట్ బౌల్ట్ ఐదు కోట్ల రూపాయలకుగాను ఐదు వికెట్లు కూల్చాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ బౌలర్ పాట్ కమిన్స్ (4.5 కోట్ల రూపాయలు/ 15 వికెట్లు), కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ క్రిస్ వోక్స్ (4.2 కోట్ల రూపాయలు/ 17 వికెట్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ స్పిన్నర్ రషీద్ ఖాన్ (4 కోట్ల రూపాయలు/ 17 వికెట్లు) తాము తీసుకున్న మొత్తానికి న్యాయం చేశారు. ముంబయి ఇండియన్స్ స్పిన్నర్ కర్న్ శర్మ 3.2 కోట్ల రూపాయలు దక్కించుకొని, 13 వికెట్లు పడగొట్టాడు. నటరాజన్ దారుణంగా విఫలమయ్యాడు. మూడు కోట్ల రూపాయలు వెచ్చించి తనను కొనుకున్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ఎలాంటి న్యాయం చేయలేకపోయాడు. ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండు వికెట్లతో సరిపుచ్చాడు. ఇదే జట్టు పేసర్ వరుణ్ ఆరోన్ 2.8 కోట్ల రూపాయలకు ఏడు వికెట్లు, సన్‌రైజర్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ 2.6 కోట్ల రూపాయలకు 10 వికెట్లు చొప్పున తమతమ ఖాతాల్లో వేసుకున్నారు. రెండు కోట్ల రూపాయలు దక్కించుకున్న వారిలో మిచెల్ జాన్సన్ (ముంబయి ఇండియన్స్/ నాలుగు వికెట్లు), ఇయాన్ మోర్గాన్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్/ 65 పరుగులు), రాహుల్ త్రిపాఠీ (రైజింగ్ పుణే సూపర్‌జెయింట్/ 388 పరుగులు), రిషభ్ పంత్ (్ఢల్లీ డేర్‌డెవిల్స్/ 366 పరుగులు), సంజూ శాంసన్ (్ఢల్లీ డేర్‌డెవిల్స్/ 386 పరుగులు) అందరి దృష్టిని ఆకర్షించారు. వీరిలో ఇయాన్ మోర్గాన్ దారుణంగా విఫలమై నిరాశ పరచగా, ఫైనల్‌లో, సంక్లిష్టమైన చివరి ఓవర్‌ను అద్భుతంగా బౌల్ చేసి మిచెల్ జాన్సన్ తన ఎంపికకు న్యాయం చేశాడు. శ్రేయాస్ అయ్యర్ (్ఢల్లీ డేర్‌డెవిల్స్), జయదేవ్ ఉనాద్కత్ (రైజింగ్ పుణే సూపర్‌జెయింట్), బాసిల్ థంపి (గుజరాత్ లయన్స్), వాషింగ్టన్ సుందర్ (రైజింగ్ పుణే సూపర్‌జెయింట్), సందీప్ శర్మ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్), పవన్ నేగీ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) తమతమ జట్లకు మెరుగైన సేవలు అందించారు.