క్రీడాభూమి

నా మణికట్టు విరిగింది .. నిరుటి వాకోవర్‌పై నాదల్ వివరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 26: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌ను పదోసారి కైవసం చేసుకునేందుకు నిరుడు బరిలోకి దిగినప్పటికీ, మణికట్టు విరగడంతో మూడో రౌండ్‌లోనే ప్రత్యర్థికి వాకోవర్ ఇవ్వాల్సి వచ్చిందని ‘క్లే కోర్టు హీరో’ రాఫెల్ నాదల్ అన్నాడు. రొలాండ్ గారోస్‌లో తొమ్మిది పర్యాయాలు విజేతగా నిలిచిన అతను నిరుడు విజయంపై ఆశతోనే అడుగుపెట్టాడు. మొదటి రౌండ్‌లో శామ్ గ్రాత్‌ను 6-1, 6-1, 6-1 తేడాతో చిత్తుచిత్తుగా ఓడించాడు. రెండో రౌండ్‌లో ఫాకండో బాగ్నిస్‌ను 6-0, 6-0, 6-3 తేడాతో ఓడించి, మార్సెల్ గ్రానొలెర్స్‌తో మూడో రౌండ్ మ్యాచ్‌ని ఖాయం చేసుకున్నాడు. అయితే, ఆ మ్యాచ్ ఆరంభానికి ముందే వైదొలగుతున్నట్టు ప్రకటించి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. కాగా, హఠాత్తుగా ప్రత్యర్థికి వాకోవర్ ఇవ్వడానికి బలమైన కారణమే ఉందన్నాడు. రెండో రౌండ్ మ్యాచ్ ఆడుతూ కిందపడినప్పుడు తన చేతి మణికట్టు దాదాపుగా విరిగిందని చెప్పాడు. చివరి క్షణం వరకూ మూడో రౌండ్ మ్యాచ్‌లో ఆడదామనే అనుకున్నానని, కానీ, తీవ్రమైన నొప్పి కారణంగా ఆడలేకపోయానని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రస్తుతం మణికట్టు గాయం తగ్గిందని, పూర్తి ఫిట్నెస్‌తోనే తాను ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ ఆడతానని అన్నాడు.
ఎండలతో బెంబేలు!
ఇలావుంటే, ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగినప్పటికీ, రోజర్ ఫెదరర్ చేతిలో రాఫెల్ నాదల్ అనూహ్యంగా ఓటమిపాలుకావడానికి ఉన్న కారణాల్లో ఎండ తీవ్రత కూడా ఒక కారణమై ఉండవచ్చన్న వాదన వినిపిస్తున్నది. ప్రతి మ్యాచ్‌లోనూ అతను పదేపదే తడి టవల్‌తో ఒళ్లు తుడుచుకోవడం, ఉషోణ్రగతను భరిచలేక, చెమటలు కక్కుతూ నీరసించడం స్పష్టంగా కనిపించింది. నాదల్‌ను ఇబ్బంది పెట్టే సమస్యల్లో అధిక ఉషోణ్రగత కూడా ఒకటి. ఒకవేళ పారిస్‌లో సామాన్యమైన స్థాయ కంటే వేడి ఎక్కువగా ఉంటే, నాదల్‌కు కష్టాలు తప్పవు.