క్రీడాభూమి

భార్య చెప్తే వినాలి కదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ బయో పిక్ ‘సచిన్ - ఎ బిలియన్ డ్రీమ్స్’ చిత్రం ప్రీమియర్ షోకు అమితాబ్ బచ్చన్ నుంచి షారుఖ్ ఖాన్ వరకు, విరాట్ కోహ్లీ నుంచి జహీర్ ఖాన్ వరకు ఎంతో మంది హేమాహేమీలు హాజరయ్యారు. భారత ప్రస్తుత, మాజీ క్రికెటర్లు చాలా మంది హాజరైనప్పటికీ, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెవాగ్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. సచిన్‌ను స్ఫూర్తిగా తీసుకొని తాను ఎదిగానని సెవాగ్ ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పాడు. సచిన్‌ను అతను ‘గాడ్‌జీ’ (దేవుడు) అని పిలుస్తాడు. అట్లాంటి వ్యక్తి ఎంతో ముచ్చటపడి పిలిచినప్పటికీ సెవాగ్ ప్రీమియర్ షోకు వెళ్లలేకపోయాడు. ఈ విషయంపై ఇప్పుడు అతను వివరణ ఇచ్చాడు. తన భార్య కోరిక మేరకు సెలవుల్లో విహార యాత్రకు వెళ్లినట్టు ట్వీట్ చేశాడు. ‘్భర్యే ముఖ్యం కదా? ఆమె చెప్తే వినాలి కదా’ అని ఎదురుప్రశ్న వేశాడు. ‘్భగవంతుడికి ప్రసాదం పెడితే చాలు శాంతిస్తాడు. కానీ, భార్య ఎందుకు రాజీకొస్తుంది’ అన్నాడు. సచిన్ బ్యాటింగ్‌ను తాను మైదానంలో ప్రత్యక్షంగా, కొన్ని సందర్భాల్లో డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఎలాంటి రుసుము లేకుండా చూశానని పేర్కొన్నాడు. ఇప్పుడు అతని బ్యాటింగ్‌ను పైసలిచ్చి చూసేందుకు బిలియన్ డ్రీమ్స్ సినిమాకు వెళతానని అన్నాడు. సమయం దొరికిన వెంటనే థియేటర్‌కు వెళతానని అన్నాడు.
పన్ను మినహాయంపు
ముంబయ: సచిన్ తెండూల్కర్ బయో పిక్ ‘సచిన్ - ఎ బిలియన్ డ్రీమ్స్’ చిత్రానికి మహారాష్ట్ర ప్రభుత్వం వినోదపు పన్నును మినహాయంచింది. ఒడిశా, చత్తీస్‌గఢ్, కేరళ రాష్ట్రాలు ఇది వరకే పన్ను మినహాయస్తున్నట్టు ప్రకటించగా, తాజాగా మహారాష్ట్ర కూ డా ఆ జాబితాలో చేరింది. ఈ సినిమాకు జేమ్స్ ఎర్కిన్సన్ దర్శకత్వం వహించాడు. ఇలావుంటే, క్యాన్సన్‌ను జయంచిన యువరాజ్ సింగ్ జీవిత కథ కూడా ఎంతో స్ఫూర్తి దాయకమైందని సచిన్ వ్యాఖ్యానించాడు.