క్రీడాభూమి

చిక్కుల్లో జయసూర్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మే 26: శ్రీలంక మాజీ బ్యాట్స్‌మన్ సనత్ జయసూర్య చిక్కుల్లో పడ్డాడు. మాజీ ప్రియు రాలితో అతని రాసలీల వీడియో ఇప్పుడు లంక సోషల్ మీడి యాలో హల్‌చల్ చేస్తుండగా, కేసు సైబర్ నేరాల విభాగానికి చేరింది. దీనితో అసలు దానిని ఎవరు పోస్ట్ చేశారో తెలుసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగినట్టు సమాచారం. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో పరిమిత ఓవర్ల తీరుతెన్నులను ఒక్కసారిగా మార్చేసిన జయసూర్య క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత రాజకీయా ల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. రాజపక్సే అధికారంలో ఉన్నప్పుడు అతను మంత్రిగా కూడా పని చేశాడు. మాజీ ప్రియురాలితో అతను శృంగారం జరుపుతున్న వీడియో బయట పడడంతో, ఇప్పుడు అందరి ముందు దోషిగా మారిపోయాడు. కాగా, అతని మాజీ ప్రియురాలు ఇప్ప డు లంకలోని ఒక మీడియా దిగ్గజం భార్య అని సమా చారం. జయసూర్య ఉద్దేశపూర్వకంగా ఆ వీడి యోను సోషల్ మీడియాలో ఉంచాడని ఆమె ఆరోపిస్తున్నట్టు తెలుస్తున్నది. అయ తే, జయసూర్య తనకే పాపం తెలియదని వాదిస్తున్నట్టు అతని సన్నిహిత వర్గాలు అంటు న్నాయ. అదే నిజమైతే, సదరు వీడియోను ఎవరు పోస్టు చేసి ఉంటారన్నది ఒక ప్రశ్నకాగా, అసలు వ్యక్తిగతమైన వీడియో వారి చేతికి ఎలా దొరికిందనే ది మరో ప్రశ్న. ఒకరి వ్యక్తితగ జీవతం గురించి సోషల్ మీడియాలో ఉంచడం చట్టవిరుద్ధం కాబట్టి, సైబర్ నేరాని కి పాల్పడిన వారికి కఠిన శిక్ష తప్పదంటున్నారు.