క్రీడాభూమి

సుదీర్మన్ కప్ బాడ్మింటన్ భారత్ నిష్క్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా), మే 26: సుదీర్మన్ కప్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి భారత్ నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాను ఢీకొన్న భారత్ 0-3 తేడాతో ఓటమిపాలైంది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో జరిగిన మొదటి మ్యాచ్‌లో అశ్వినీ పొన్నప్ప, సాత్విక్ సాయిరాజ్ జోడీ 21-16, 13-21, 16-21 తేడాతో ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ లూ కయ్, హువాంగ్ యాక్వియాంగ్ చేతిలో ఓటమిపాలైంది. పురుషుల సింగిల్స్ కిడాంబి శ్రీకాంత్ తీవ్రంగా పోరాడినప్పటికీ, రియో ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్‌ను కట్టడి చేయలేకపోయాడు. 48 నిమిషాల పోరు 16-21, 17-21 తేడాతో శ్రీకాంత్ ఓడడంతో ముగిసింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ సేన్ జోడీ 9-21, 11-21 తేడాతో ఫు హైఫెంగ్, జాంగ్ నాన్ జోడీ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. దీనితో 0-3 తేడాతో వెనుకబడిన భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో, మహిళల సింగిల్స్, మహిళల డబుల్స్ విభాగాల్లో మ్యాచ్‌లకు ప్రాధాన్యత లేని కారణంగా వాటిని రద్దు చేశారు.