క్రీడాభూమి

గెలిచింది ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 26: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీ ఆదివారం నుంచి మొదలు కానుండగా, మరియా షరపోవాకు వైల్డ్‌కార్డ్ ఎంట్రీని ఇవ్వకుం డా నిర్వాహకులు గెలిచారా? ఆమెను ఆడించడానికి వీల్లేదని గగ్గోలు పెట్టిన ఇతర క్రీడాకా రిణులు గెలిచారా? ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడే అవకాశం రాకపో యనప్పటికీ, కోట్లాది మంది అభి మానుల మద్దతును సంపాదించు కున్న షరపోవా గెలిచిందా? పరిస్థి తులను, పరిణామాలను బట్టి చూస్తే రొలాండ్ గారోస్ టోర్నీ ని ర్వాహకుల నిర్వాకం వారికి చెడ్డ పేరు తీసుకురాగా, షరపోవాపై సానుభూతి విపరీ తంగా పెరిగిందని అర్థమవు తుంది. కాగా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడానికి టోర్నమెంట్ నిర్వాహకులు నిరాకరించడంపై అభిమా నులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అన్ని విధాలా అర్హతగల ఆమెను ఎందుకు నిర్ల క్ష్యం చేస్తున్నారని అధికారులను నిలదీస్తున్నారు. అంతర్జాతీయ మహిళల టెన్నిస్ సమాఖ్య (డబ్ల్యుటిఎ) సైతం ఫ్రెంచ్ ఓపెన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే ఆమెను అణచివేస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తున్నది. ఆమెకు అన్యాయం చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయ. షరపోవాకు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చేందుకు నిర్వాహకులు నిరాకరించడం ఎవరి ఓటమి? ఎవరి గెలుపు? డోపింగ్‌కు పాల్పడినట్టు స్వయంగా అంగీకరించి, 15 నెలల నిషేధాన్ని ఎదుర్కొన్న ఆమె మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తున్న క్రీడాకారిణులు నిజంగానే గెలిచారా? వైల్డ్‌కార్డ్ ఎంట్రీని సంపాదించలేకపోయిన షరపోవా వాస్తవంగానే ఓడిందా? రొలాండ్ గారోస్‌లో ప్రతిష్ఠాత్మక గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీ ఆరంభమవుతున్న తరుణంలో హాట్ టాపిక్‌గా మారిన ప్రశ్నలివి. నిజానికి షరపోవా నిషిద్ధ మాదక ద్రవ్యాలను వాడినట్టు ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా)గానీ, ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహకులుగానీ ప్రకటించలేదు. ఆమే స్వయంగా విలేఖరుల సమావేశ పెట్టి వెల్లడించే వరకూ ఈ విషయం అసలు ప్రపంచానికి తెలియదు. తాను డోపింగ్‌కు పాల్పడ్డానని షరపోవా చేసిన ప్రకటన అప్పట్లో యావత్ క్రీడా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది. జీవితంలో చాలా పెద్ద తప్పు చేశానని, అభిమానులను తలదించుకునేలా ప్రవర్తించానని 2016 మార్చి 7న విలేఖరుల సమావేశంలో ఆమె ప్రకటించింది. అదే ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా జరిపిన డోప్ టెస్టులో దొరికిపోయానని చెప్పింది. వాడాగానీ, ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ మేనేజ్‌మెంట్‌గానీ స్పందించడానికి ముందే షరపోవా ఈ విషయాన్ని వెల్లడించడం ఆమె నిజానికి నిదర్శనంగా చెప్పుకోవాలి. వంశ పారంపర్యంగా వస్తున్న డయాబెటిస్ (సుగర్ వ్యాధి) రాకుండా, ముందు జాగ్రత్త చర్యగానే తాను గత పది సంవత్సరాలుగా ‘మెల్డోనియం’ అనే మందును వాడుతున్నానని ఆమె ప్రకటన సారాంశం. నిజానికి అదే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ‘మెల్డోనియం’ను నిషిద్ధ ఉత్ప్రేరకాల జాబితాలో చేరుస్తున్నట్టు వాడా ప్రకటించింది. అంటే, దాదాపు ఆస్ట్రేలియా ఓపెన్‌కు సిద్ధమవుతున్న తరుణంలోనే ఈ ప్రకటన వెలువడింది. ఆమె ‘మెల్డోనియం’ వాడకాన్ని హఠాత్తుగా నిలిపివేసినప్పటికీ, డోపింగ్ పరీక్షలో దోషిగానే ప్రపచం ముందుకు వచ్చేది. కాబట్టి, ఆమెను దోషేనని నిర్ధారించడానికిగానీ, కాదని వాదించడానికిగానీ వీల్లేని పరిస్థితి. కానీ, ఏ క్రీడలోనైనా ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ అథ్లెట్లకు ఇస్తారే తప్ప ఆయా క్రీడా సంఘాలు లేదా సమాఖ్యలకు కాదు. ఈ కోణంలో చూస్తే షరపోవాపై సస్పెన్షన్ వేటు వేయడమే అన్యాయం. నిబంధనలను అనుసరించి శిక్షా కాలాన్ని పూర్తి చేసిన తర్వాత, మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగించకుండా అడ్డుకోవడం దుర్మార్గం. ఆరోగ్యపరమైన కొన్ని సమస్యల కారణంగా తాను ‘మెల్డోనియం’ను వాడినట్టు ఆమె చేసిన ప్రకటనను అబద్ధంగా కొట్టిపారేయకూడదు. ఆ ఔషధం నిషిద్ధ మాదక ద్రవ్యమన్న విషయం తనకు తెలియదని ఆమె వాపోవడాన్ని ఒక డ్రామాగా పేర్కోవడానికి అంతకంటే వీల్లేదు. ఏదిఏమైనా, నిషిద్ధ మాదక ద్రవ్యాల జాబితాను చూడపోవడం, ‘మెల్డోనియం’ అనే ఔషధాన్ని కొత్తగా అందులో చేర్చారనే విషయాన్ని గమనించకపోవడం తన పొరపాట్లుగా ఆమె అంగీకరించింది. ఈ పరిణామాలు తనను తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నాయంటూ కన్నీళ్ల పర్యంతమైంది. అభిమానులు తన వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని వాపోయింది. టెన్నిస్‌ను కూడా నేను కించపరిచానని బాధపడింది. ప్రతి ఒక్కరికీ క్షమాపణ చెప్పింది. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదంటారు. అంతేకాదు, డోపింగ్ లేదా మరే ఇతర కారణాలతోనైనా నిషేధానికి గురైన క్రీడాకారులు తమ శిక్షాకాలం పూర్తయిన తర్వాత మళ్లీ కెరీర్‌ను కొనసాగించడం కొత్తకాదు. అత్యంత సాధారణమైన ఈ విషయాన్ని మిగతా క్రీడాకారులు భూతద్దంలో చూపిస్తూ హంగామా చేయడంలో అంతరార్థం ఏమిటో ఎవరూ చెప్పలేకపోతున్నారు. కొంత మంది క్రీడాకారిణుల డిమాండ్‌కు తలవంచి, షరపోవాకు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడే అవకాశం కల్పించకపోవడం నిర్వాహకుల ఓటమిగానే చెప్పాలి. ఈ విషయంలో షరపోవా కాదు.. ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు, ఆమె పునరాగమనాన్ని వ్యతిరేకిస్తున్న క్రీడాకారిణులు దారుణంగా ఓడారు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించకపోవడంతో ఒక మేజర్ టోర్నీలో ఆడే అవకాశాన్ని షరపోవా కోల్పోయి ఉండవచ్చు. కానీ, ఆమె కోట్లాది మంది అభిమానుల మద్దతును సంపాదించుకోగలిగింది. ఈ కోణంలో ఆమే గెలిచింది. నిర్వాహకులు దారుణంగా ఓడారు.