క్రీడాభూమి

తొలి రౌండ్‌లోనే టాప్ సీడ్ ఓటమి ఇదే మొదటిసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ 1968లో ‘ఓపెన్ టోర్నీ’గా మారిన తర్వాత మహిళల సింగిల్స్‌లో ఒక టాప్ సీడ్ తొలి రౌండ్‌లో పరాజయాన్ని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. నంబర్ వన్ క్రీడాకారిణిగా టోర్నీలోకి అడుగుపెట్టిన కెర్బర్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ, మొదటి రౌండ్ నుంచే నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఆమె 2012లో క్వార్టర్ ఫైనల్స్ చేరింది. రోలాండ్ గారోస్‌లో ఆమెకు అదే అత్యుత్తమ ప్రదర్శన. కాగా, నిరుడు మూడో ర్యాంక్ క్రీడాకారిణిగా బరిలోకి దిగిన ఆమె మొదటి రౌండ్‌లో కికీ బెర్టెన్స్ చేతిలో 2-6, 6-3, 3-6 తేడాతో ఓటమిపాలైంది. జర్మనీకి చెందిన ఈ ఎడమచేతి వాటం క్రీడాకారిణి ఇటీవల జరిగిన స్టట్‌గార్ట్, రోమ్ ఓపెన్ టోర్నీల్లోనూ మొదటి రౌండ్‌కే పరిమితమైంది. మాడ్రిడ్‌లో ప్రీ క్వార్టర్స్ చేరినప్పటికీ, గాయం కారణంగా వైదొలగింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నప్పటికీ, ఇటీవల కాలంలో ఆమె ఆశించిన స్థాయి ఫామ్‌ను కనబరచడం లేదు. నిరుడు ఆస్ట్రేలియా, యుఎస్ ఓపెన్ టైటిళ్లను గెల్చుకోవడమేగాక, వింబుల్డన్‌లో ఫైనల్ వరకూ చేరింది. అక్కడ రన్నర్ ట్రోఫీని తీసుకుంది. కానీ, ఈ ఏడాది ఆమె ఫామ్‌ను కొనసాగించలేకపోతున్నది. గత ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు పరాజయాలను ఎదుర్కోవడం కెర్బర్ ఎదుర్కొంటున్న వైఫల్యాలకు నిదర్శనం.