క్రీడాభూమి

క్విటోవా శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్: రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న పెట్రా క్విటోవా సుమారు ఆరు నెలల తర్వాత మళ్లీ అంతర్జాతీయ టోర్నీలో అడుగుపెట్టి, శుభారంభం చేసింది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ మొదటి రౌండ్‌లో 15వ ర్యాంకర్ క్విటోవా ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలిచింది. జూలియా బెసెర్ప్‌ను ఆమె 6-3, 6-2 తేడాతో ఓడించి, రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. నిరుడు డిసెంబర్‌లో చేతికి బలమైన గాయమైన కారణంగా విశ్రాంతి తీసుకున్న ఆమె తిరిగి కెరీర్‌ను కొనసాగించడం అభిమానులకు ఊరటనిచ్చింది. నిరుడు డిసెంబర్‌లో తన ఇంట్లోకి చొరబడిన దొంగను క్విటోవా అడ్డుకుంది. అతను కత్తితో పొడవడానికి ప్రయత్నించడంతో చేతులు అడ్డుపెట్టింది. ఈ సంఘటనలో ఆమె చేతికి గాయమైంది. చికిత్స పొంది, పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమె మళ్లీ టెన్నిస్ కోర్టులోకి దిగింది.