క్రీడాభూమి

చైనాపై భారత్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆసియా బాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో గురువారం భారత్ 3-2 తేడాతో చైనా జట్టును ఓడించింది. టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు చైనాను ఓడించడం ఇదే తొలిసారి. కిదాంబి శ్రీకాంత్, అజయ్ జయరామ్, హెచ్‌ఎస్.ప్రణయ్ తమతమ సింగిల్స్ మ్యాచ్‌లలో జయకేతనం ఎగురవేసి భారత జట్టుకు ఈ విజయాన్ని అందించారు. ఈ టోర్నమెంట్‌లో భారత పురుషుల, మహిళల జట్లు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాయి. అయితే గురువారం పురుషుల విభాగంలో జరిగిన పోరులో భారత జట్టు మొత్తం ఐదు మ్యాచ్‌లకు గాను మూడు సింగిల్స్ మ్యాచ్‌లను గెలుచుకుని రెండు డబుల్స్ మ్యాచ్‌లను కోల్పోయింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 9వ స్థానంలో కొనసాగుతూ ఈ టోర్నీలో భారత టాప్ ఆడగాడిగా బరిలోకి దిగిన కిదాంబి శ్రీకాంత్ తొలి సింగిల్స్ మ్యాచ్‌లో 2-0 (21-11, 21-17) గేముల తేడాతో చైనా ఆటగాడు హువెయి తియాన్‌ను మట్టికరిపించి చక్కటి శుభారంభాన్ని అందించగా, రెండో సింగిల్స్ మ్యాచ్‌లో అజయ్ జయరామ్ ర్యాంకింగ్స్‌లో తనకంటే ఎంతో ముందున్న జెంగ్‌మింగ్ వాంగ్‌పై 2-1 (22-20, 15-21, 21-18) తేడాతో విజయం సాధించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అజయ్ జయరామ్ ప్రస్తుతం 25వ స్థానంలో కొనసాగుతుండగా, జెంగ్‌మింగ్ వాంగ్ 11వ స్థానంలో ఉన్నాడు. కాగా, మూడో సింగిల్స్ మ్యాచ్‌లో హెచ్‌ఎస్.ప్రణయ్ 2-0 (21-14, 21-10) తేడాతో తన ప్రత్యర్ధి యుకీ షిపై సునాయాసంగా గెలుపొందాడు. అయితే డబుల్స్‌లో మాత్రం భారత్‌కు రెండు మ్యాచ్‌లలోనూ ఓటమి ఎదురైంది. తొలి మ్యాచ్‌లో మను అత్రి-సుమీత్ రెడ్డి జోడీ 20-22, 11-21 తేడాతో జున్హుయి లీ-జిహన్ కియు చేతిలో పరాజయాన్ని ఎదుర్కోగా, రెండో డబుల్స్ మ్యాచ్‌లో చైనాకు చెందిన ఇల్వ్ వాంగ్-వెన్ జాంగ్ 21-10, 21-18 గేముల తేడాతో ప్రణవ్ జెర్రీ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ జోడీపై విజయం సాధించారు. అయితే ప్రపంచ బాడ్మింటన్‌లో బలమైన శక్తిగా కొనసాగుతున్న చైనా జట్టుపై విజయం సాధించడంతో భారత ఆటగాళ్లు, అభిమానుల్లో సంతోషం మిన్నంటింది.
మహిళల విభాగంలో ఘోర పరాభవం
అయితే మహిళల విభాగంలో భారత జట్టు 0-5 తేడాతో జపాన్ చేతిలో ఓటమి పాలైంది. సింగిల్స్ మ్యాచ్‌లలో పివి.సింధు, పిసి.తులసీ, గద్దే రుత్వికా శివానీ, అలాగే డబుల్స్ మ్యాచ్‌లలో జ్వాలా గుత్తా-అశ్వనీ పొన్నప్ప, సిక్కీరెడ్డి-పివి.సింధు తమతమ ప్రత్యర్థుల చేతిలో వరుసగా ఓటముల పాలవడంతో భారత జట్టుకు ఈ ఘోర పరాజయం తప్పలేదు.

చిత్రం... పురుషుల సింగిల్స్ విజేతలు హెచ్‌ఎస్. ప్రణయ్, అజయ్ జయరామ్, కిదాంబి శ్రీకాంత్